న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'క్రికెట్ వదిలేసి పూర్తిగా యోగా టీచర్ అయిపోదామనుకున్నా'!!

Cameron Bancroft admitted considering giving away cricket for yoga

సిడ్నీ: బాల్‌టాంపరింగ్‌కు పాల్పడినందుకు తొమ్మిది నెలల నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్‌ కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ ఓ దశలో యోగా కోసం క్రికెట్‌ను వదిలేద్దామనుకున్నాడట. మరో వారంలో అతని నిషేధం పూర్తవనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా పత్రికకు రాసిన ఓ లేఖలో కామెరూన్‌ ఈ విషయాన్ని చెప్పాడు. 'ఇక నువ్వు క్రికెట్‌ కోసం కాదేమో.. నిన్ను నువ్వు ప్రశ్నించుకో.. నువ్వు మళ్లీ తిరిగి మైదానంలో అడుగుపెట్టగలవా? దానికంటే యోగా మేలేమో ఆలోచించు' అని తాను ప్రశ్నించుకున్నట్టుగా బాన్‌క్రాఫ్ట్‌ చెప్పాడు. నిషేధం సమయంలో బాన్‌క్రాఫ్ట్‌ యోగాపై దృష్టిసారించాడు.

 యోగా మరచిపోలేని అనుభవాన్ని ఇచ్చిందని

యోగా మరచిపోలేని అనుభవాన్ని ఇచ్చిందని

బహిష్కరణ వేటు పడ్డాక తన దృక్పథం పూర్తిగా మారిపోయిందని... ఒక దశలో క్రికెట్‌ వదిలేసి యోగా టీచర్‌గా మారిపోదామని అనుకున్నానని తెలిపాడు. తాను క్రికెటర్‌ననే భావన నుంచి బయటకు వచ్చి కొత్తగా ఆలోచించే విషయంలో యోగా మరచిపోలేని అనుభవాన్నిచ్చిందని అతను చెప్పుకొచ్చాడు. ఐతే తానేంటో నిరూపించుకోవడానికి మళ్లీ క్రికెట్లో అడుగుపెట్టడమే సరైందని భావించానని తెలిపాడు. ‘దక్షిణాఫ్రికాలో తప్పు చేసిన వ్యక్తిని మర్చిపోయి.. నువ్వేంటో నిరూపించుకో' అని తనకు తాను చెప్పుకొన్నట్లుగా బాన్‌క్రాఫ్ట్‌ లేఖలో పేర్కొన్నాడు.

డిసెంబరు 30 నుంచి మళ్లీ బరిలోకి

డిసెంబరు 30 నుంచి మళ్లీ బరిలోకి

బాన్‌క్రాఫ్ట్‌ డిసెంబరు 30న బిగ్‌ బాష్‌ టీ20 లీగ్‌లో బరిలో దిగబోతున్నాడు. డిసెంబర్‌ 30 నుంచి ప్రారంభం కానున్న బిగ్‌ బాష్‌ టి20 లీగ్‌తో బాన్‌క్రాఫ్ట్‌ క్రికెట్‌లోకి పునఃప్రవేశం చేయనున్నాడు. ఇదే లీగ్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఆస్ట్రేలియా నిషేదిత కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను సహ జట్లు అంగీకరించకపోవడంతో లీగ్ నుంచి తప్పుకున్నాడు.

బాల్ ట్యాంపరింగ్‌తో ముగ్గురు క్రికెటర్లకు చీకటి

బాల్ ట్యాంపరింగ్‌తో ముగ్గురు క్రికెటర్లకు చీకటి

దీనిపట్ల స్మిత్ మాట్లాడుతూ.. ఏం జరిగిందో తెలియదు వద్దన్నారు. ఐపీఎల్‌లో ఆడాలనుకుంటున్నాను. ఒకవేళ ఆడితే ఆ అనుభవం ప్రపంచకప్‌కు ఉపయోగపడుతుందని భావిస్తున్నానని తెలిపాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో బాన్ క్రాఫ్ట్‌కు 9 నెలల పాటు నిషేదానికి గురికాగా, అప్పటి కెప్టెన్, వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు నిషేదానికి గురి అయ్యారు.

Story first published: Sunday, December 23, 2018, 14:34 [IST]
Other articles published on Dec 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X