న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో రెండు రోజుల్లో సీఏసీ: ఐపీఎల్ వేలం ఆశ్చర్యం కలిగించలేదన్న సౌరవ్ గంగూలీ

 CAC to be formed soon to pick selectors, says BCCI President Sourav Ganguly

హైదరాబాద్: మరో రెండు రోజుల్లో క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)ను ఏర్పాటు చేయనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం తెలిపారు. మూడేళ్ల పాటు పదవిలో ఉండే కొత్త సెలెక్షన్ ప్యానెల్‌ను ఈ క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఎంపిక చేస్తుందని గంగూలీ తెలిపాడు.

ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ పదవీ కాలం ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. వారి స్థానంలో సెలక్షన్ కమిటీని బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఫాంటసీ స్పోర్ట్స్ గేమ్ 'మై 11 సర్కిల్' కార్యక్రమానికి హాజరైన గంగూలీ దీనిపై మాట్లాడాడు.

IPL 2020: ఈ సారైనా టైటిల్ నెగ్గేనా, వేలం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టిదేIPL 2020: ఈ సారైనా టైటిల్ నెగ్గేనా, వేలం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టిదే

"క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)ని మరో రెండు రోజుల్లో నియమిస్తారు. హెడ్ కోచ్‌ను ఇప్పటికే ఎంపిక చేసినందున కేవలం సెలెక్టర్లను నియమించానికి ఒక సమావేశం సరిపోతుంది" అని ఈ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చారు. భారత క్రికెట్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లారనే ప్రశ్నకు దాదా తనదైన శైలిలో స్పందించాడు.

"అధ్యక్ష పదవి చేపట్టి కేవలం రెండు నెలలే అయింది. పింక్ బాల్ టెస్టు ఒకటి. అవసరమైన వేరే ఇతర క్రికెట్ అవసరాలు కూడా నిర్ణీత సమయంలో చేయాల్సి ఉంది" అని గంగూలీ వెల్లడించాడు. ఈ సందర్భంగా ఐపీఎల్ 2020పై గంగూలీ స్పందించాడు. యువ క్రికెటర్లకు ఐపీఎల్ ఓ మంచి ప్లాట్ ఫామ్ అని చెప్పాడు.

IPL 2020: అత్యధికంగా 11 మందిని తీసుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌.. పూర్తి జట్టిదే!!IPL 2020: అత్యధికంగా 11 మందిని తీసుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌.. పూర్తి జట్టిదే!!

సీనియర్, జూనియర్, జాతీయ ఆటగాళ్లు కూడా ఈ లీగ్‌లో పాల్గొంటారని, ప్రపంచంలోనే ఇది అది పెద్ద లీగ్ అని దాదా కొనియాడాడు. ఐపీఎల్‌పై భారీ స్థాయిలో ఆసక్తి ఉండటం తనను ఏమీ ఆశ్చర్య పరచలేదని చెప్పుకొచ్చాడు. పాక్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్ ఆడి చాలా కాలం అయ్యింది కదా? అని అడిగిన ప్రశ్నకు పాక్‌తో ఆడటం అనేది ప్రభుత్వ నిర్ణయమని అన్నాడు.

పౌరసత్వ సవరణ బిల్లు(సీఎఎ)పై సోషల్ మీడియాలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై దాదా మాట్లాడుతూ "నేను ట్విట్టర్‌లో ఏమి చెప్పాలో చెప్పాను. సనా పేరు మీద చాలా నకిలీ ట్వీట్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. నాకు కూడా ఎక్కడి నుంచో కొన్ని ట్వీట్లు వచ్చాయి. సనా ఇంకా చాలా చిన్న పిల్ల" అని గంగూలీ అన్నాడు.

Story first published: Friday, December 20, 2019, 17:41 [IST]
Other articles published on Dec 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X