న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2021’.. టీమిండియా నుంచి ఒక్కడు లేడు!

 Buttler, Rizwan, Marsh and Hasaranga nominated for T20I Player of the year award

దుబాయ్: ఐసీసీ పురుషుల టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు కోసం నలుగురు ఆటగాళ్లను నామినేట్ చేశారు. ఈ వివరాలను ఐసీసీ బుధవారం ప్రకటించింది. అయితే ఈ జాబితాలో టీమిండియా నుంచి ఒక్క ప్లేయర్‌కు కూడా చోటు దక్కలేదు. ఇంగ్లండ్ స్టార్​ బ్యాట్స్​మన్​ జోస్​ బట్లర్​, శ్రీలంక ఆల్​రౌండర్​ వానిందు హసరంగా, అస్ట్రేలియా బ్యాట్స్‌మన్​ మిచెల్​ మార్ష్​, పాకిస్థాన్​ వికెట్​ కీపర్​ మహ్మద్​ రిజ్వాన్​ ఈ అవార్డు రేసులో నిలిచారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఈ నలుగురు ఆటగాళ్లు సత్తా చాటారు.

ప్రపంచకప్‌తో పాటు..

ప్రపంచకప్‌తో పాటు..

జోస్​ బట్లర్​.. ఈ ఏడాది టీ20 క్రికెట్​లో అద్భుతంగా రాణించాడు. మొత్తంగా 589 పరుగలు చేశాడు. టీ20 ప్రపంచకప్​లో 269 రన్స్​తో అదరగొట్టాడు.ఆస్ట్రేలియా ప్లేయర్​ మిచెల్ మార్ష్​.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. న్యూజిలాండ్​తో జరిగిన ఫైనల్లో 50 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఈ ఏడాది అతను 627 పరుగులు చేశాడు. పాకిస్థాన్​ వికెట్​ కీపర్ మహ్మద్​ రిజ్వాన్​.. టీ20 ప్రపంచకప్​లో 281 పరుగులు చేయగా.. మొత్తంగా ఈ ఏడాది టీ20 ఫార్మాట్​లో 1326 రన్స్​ చేశాడు. శ్రీలంక ఆల్​రౌండర్​ వనిందు హసరంగా ఈ ఏడాది టీ20 ఫార్మాట్​లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మొత్తంగా 11.63 సగటుతో 36 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్​లోనూ తనదైన ముద్రవేశాడు.

టెస్ట్ అవార్డు రేసులో..

టెస్ట్ అవార్డు రేసులో..

ఐసీసీ పురుషుల టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు నామినీలను మంగళవారం ప్రకటించగా.. భారత్ నుంచి ఈ అవార్డు రేసులో రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. అశ్విన్‌తో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్, న్యూజిలాండ్ స్టార్ పేసర్ కైల్ జెమీసన్, శ్రీలంక క్రికెటర్ దిముత్ కరుణరత్నే ఈ అవార్డు రేసులో నిలిచారు. అశ్విన్ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌ల్లో(సౌతాఫ్రికాతో మ్యాచ్‌ను మినహాయించి) 16.23 సగటుతో 52 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 28.08 సగటుతో 337 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.

టాప్ స్కోరర్‌గా జోరూట్

టాప్ స్కోరర్‌గా జోరూట్

ఈ ఏడాది 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జో రూట్ 29 ఇన్నింగ్స్‌లో 61 స‌గ‌టుతో 1,708 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 సెంచ‌రీలు, 4 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఈ ఏడాది 5 మ్యాచ్‌లు ఆడిన జెమీసన్ 17.51 యావరేజ్‌తో 27 వికెట్లు తీశాడు. అటు బ్యాటింగ్‌లో 17.50 సగటుతో 105 రన్స్ చేశాడు. ముఖ్యంగా భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో జెమీసన్ బంతితో మెరిసాడు. శ్రీలంకకు చెందిన దిముత్ కరుణరత్నే 7 మ్యాచ్‌ల్లో 69.38 సగటుతో 902 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలున్నాయి.

 ఓటింగ్ ద్వారా విజేత..

ఓటింగ్ ద్వారా విజేత..

మూడు ఫార్మాట్లలోని ప్రతీ కేటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ ఏడాది కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ప్రతీ ఫార్మాట్‌కు షార్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్‌లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌కు సంబంధించిన సభ్యులు ఉంటారు. జనవరి 24న విన్నర్‌ను డిసైడ్ చేస్తారు.

Story first published: Wednesday, December 29, 2021, 21:19 [IST]
Other articles published on Dec 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X