వీడియో: డిఫెన్స్ లేదు..అటాకింగ్ లేదు! కుమ్మేయ‌డ‌మే!

Bull Playing Foot Ball, Video Goes Viral Now ! || Oneindia Telugu

ప‌నాజీ: ఫుట్‌బాల్ మ్యాచ్ అంటే దానికో ప్లానింగ్ ఉంటుంది. మ్యాచ్ గెల‌వ‌డానికి వ్యూహాలు, ప్ర‌తివ్యూహాల‌తో తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తుంటారు ఆట‌గాళ్లు. ఫుట్‌బాల్ కోచ్‌లు ఇచ్చే విలువైన స‌ల‌హాల‌ను పాటిస్తుంటారు. ప్రాక్టీస్ సెష‌న్‌తో చెమ‌టోడ్చుతుంటారు. అదీ ఓ ప్రొఫెష‌న‌ల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ముందు సాధార‌ణంగా క‌నిపించే స‌న్నివేశాలు.

అలాంటి వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులు ఈ కొమ్ములు తిరిగిన ఎద్దు ముందు ఎందుకూ కొర‌గావు. ఈ గోవా ఎద్దు నుంచి బంతిని లాక్కోవ‌డం లియోనెన్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోల వ‌ల్ల కూడా చేత‌కాదు. ఈ వీడియో చూస్తే నిజ‌మేన‌ని ఒప్పుకొని తీరాల్సిందే మ‌రి!

గోవాలో కొంద‌రు స‌ర‌దాగా ఫుట్‌బాల్ ఆడుతుండ‌గా.. అటుగా వెళ్తున్న ఓ ఎద్దు దీన్ని ప‌సిగ‌ట్టింది. మ‌న‌మూ ఓ కాలు వేస్తే పోలా అనుకున్న ఆ ఎద్దు స‌రాస‌రి గ్రౌండ్‌లోకి వ‌చ్చేసింది. గ్రౌండ్‌లో మ‌ధ్య నిల్చుంది. ఓ యువ‌కుడు కొట్టిన షాట్‌కు ఫుట్‌బాల్ ఆ ఎద్దు కాళ్ల వ‌ద్ద ప‌డింది. అంతే! ఇక దాని నుంచి ఆ బంతిని బ‌య‌టికి తీయ‌డం వారి వ‌ల్ల కాలేదు. బంతిని దొర‌క‌బుచ్చుకోవడానికి వారి జేజ‌మ్మ దిగి రావాల్సిందే అనిపించేలా ప‌ట్టు బిగించిందా ఎద్దు. బంతిపై గిట్ట‌లు ఉంచి, స్టైల్‌గా అటూ, ఇటూ తిప్పుతూ క‌నిపించింది.

ఎవ‌రైనా బంతి కోసం వెళ్తే కొమ్ములు విసిరి, త‌రిమేసింది. ఓ యువ‌కుడు సాహ‌సం చేసి, బంతిని అందుకుని, షాట్ ఆడ‌గా.. ఆ బంతి వెనుకే ప‌రుగెత్తింది ఎద్దు కూడా. మ‌ళ్లీ దాన్ని దొర‌క‌బుచ్చుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో సునామీని సృష్టించింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, July 3, 2019, 8:30 [IST]
Other articles published on Jul 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X