న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!

Brisbane Test: Rohit Sharma says No regrets playing that shot

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నిర్లక్ష్యపు షాట్‌ ఆడి ఔటయ్యాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన బ్యాటింగ్‌ తీరుపై వస్తున్న విమర్శలను రోహిత్ తిప్పికొట్టాడు. ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో ఏరియల్‌ షాట్‌ ఆడి ఔటైనందుకు పశ్చాత్తాపం అస్సలు లేదని రోహిత్‌ చెప్పాడు. గతంలో అదే టెక్నిక్‌తో విజయవంతంగా బౌండరీలు సాధించిన సందర్భాలను గుర్తుచేశాడు. బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకు అలాంటి షాట్‌లు ఆడతానని తెలిపాడు.

మాజీలు ఫైర్:

మాజీలు ఫైర్:

కుదురుకున్న హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఔటవ్వడం విస్మయానికి గురిచేసిందని మాజీలు సునీల్‌ గవాస్కర్, సంజయ్‌ మంజ్రేకర్, ఆకాశ్ చోప్రా విమర్శించారు. అది బాధ్యతారాహిత్యమైన షాట్‌ అని విశ్లేషించారు. రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం, అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్ అని సన్నీ ఫైర్ అయ్యాడు. ఇక సామాజిక మాధ్యమాల్లోనూ రోహిత్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట ముగిసిన అనంతరం‌ రోహిత్‌ శర్మ మీడియాతో మాట్లాడాడు.

పశ్చాత్తాపం లేదు:

పశ్చాత్తాపం లేదు:

'ఆ షాట్ ఆడినందుకు పశ్చాత్తాపం లేదు. బౌలర్లపై ఒత్తిడి పెంచడానికి అలాంటి షాట్‌లు ఆడతాను. నాథన్ లైయన్‌ తెలివైన బౌలర్‌. కష్టతరమైన బంతుల్ని విసురుతున్నాడు. అదే టెక్నిక్‌తో గతంలో ఎన్నో సార్లు విజయవంతమయ్యా. కొన్నిసార్లు బంతి బౌండరీ అవతల పడవచ్చు. మరికొన్ని సార్లు ఔట్ అవ్వొచ్చు. దురదృష్టవశాత్తు ఈ సారి ఔటయ్యా. ఏదేమైనా అలాంటి షాట్‌లు కొనసాగిస్తాను. అయితే నాపై జట్టు ఎంతో నమ్మకం ఉంచింది. దానికి తగ్గట్లుగా ఆడటం నా బాధ్యత. విమర్శల గురించి ఆలోచించను. నా దృష్టంతా ఆటపైనే ఉంటుంది' అని రోహిత్ తెలిపాడు.

ఉత్తిపుణ్యాన వికెట్:

ఉత్తిపుణ్యాన వికెట్:

గబ్బా మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన రహానే సేన 11 పరుగులకే గిల్‌ (7) వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారాతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. అయితే అర్ధ శతకం దిశగా దూసుకెళ్తున్న రోహిత్.. 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. లైయన్‌ వేసిన 20వ ఓవర్‌ అయిదో బంతికి మిడ్‌-ఆన్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే టైమింగ్‌ కుదరకపోవడంతో స్టార్క్‌ చేతికి చిక్కాడు. దీంతో ఉత్తిపుణ్యాన వికెట్‌ సమర్పించుకున్నాడని విమర్శలు వస్తున్నాయి.

రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!

Story first published: Saturday, January 16, 2021, 19:50 [IST]
Other articles published on Jan 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X