న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!

Sunil Gavaskar slams Rohit Sharma for irresponsible Shot

బ్రిస్బేన్‌: ఐపీఎల్ 2020లో గాయం అవ్వడంతో ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌కు హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ దూరమయ్యాడు. అంతేకాదు తొలి రెండు టెస్టులు ఆడని రోహిత్.. మూడో టెస్టు నుంచి జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలోనే సిడ్నీ టెస్టులో (26, 52) పరుగులు చేశాడు. ఇక గబ్బాలో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో (44; 74 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీ ముందు ఔట్ అయ్యాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో పేలవ షాట్ ఆడి ఔటయ్యాడు.

నిర్లక్ష్యపు షాట్ ఆడి:

నాథన్ లైయన్‌ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి రోహిత్ శర్మ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ షాట్ హిట్‌మ్యాన్‌ ఆశించిన విధంగా కనెక్ట్ కాలేదు. దాంతో గాల్లోకి లేచిన బంతి లాంగాన్‌లో ఫీల్డర్ మిచెల్ స్టార్క్ చేతికి చిక్కింది. టెస్టు క్రికెట్‌లో రోహిత్ నుంచి ఈ తరహా నిర్లక్ష్యపు షాట్‌ని ఊహించలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హిట్‌మ్యాన్‌ షాట్ సెలెక్షన్‌పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా మండిపడ్దాడు. ఎందుకింత నిర్లక్ష్యం, అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్ అని ఫైర్ అయ్యాడు.

ఎవరూ ఊహించని షాట్:

ఎవరూ ఊహించని షాట్:

'రోహిత్ శర్మ ఇలా ఎందుకు.. ఎందుకు.. ఎందుకు. ఆ షాట్ ఎవరూ ఊహించనిది. సరిగ్గా చెప్పాలంటే నిర్లక్ష్యపు షాట్. లాంగాన్‌లో ఫీల్డర్ ఉన్నాడు, అలానే డీప్ స్వ్కేర్‌ లెగ్‌లోనూ ఓ ఫీల్డర్‌ ఉన్నాడు. అయినా కూడా ఆ షాట్ ఎందుకు ఆడావు?. ఆ షాట్‌కి రెండు బంతుల ముందు బౌండరీ బాదావు. ఆ తర్వాత కూడా ఆ తాపత్రయమేనా? రోహిత్ శర్మ ఒక సీనియర్ ఆటగాడు.. షాట్ సెలక్షన్‌పై అతనికి మినహాయింపులు ఏమీ ఉండవు. ఓ నిర్లక్ష్యపు షాట్‌తో అప్పనంగా ఆస్ట్రేలియాకి వికెట్ సమర్పించుకున్నాడు' అని సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.

పదేపదే ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా:

పదేపదే ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా:

రోహిత్‌ శర్మ టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధికంగా ఆరు సార్లు నాథన్ లైయన్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడతో సమానంగా లైయన్‌.. ఐదు సార్లు టీమ్‌ఇండియా ఓపెనర్‌ను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో రోహిత్‌ను టెస్టుల్లో అత్యధిక సార్లు ఔట్‌ చేసిన బౌలర్‌గా ఈ ఆస్ట్రేలియా స్పిన్నర్‌ రికార్డు నెలకొల్పాడు. శర్మకి పదేపదే ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతులేస్తూ వచ్చిన లైయన్‌.. అతని శరీరంపైకి టర్న్ చేస్తూ కనిపించాడు. దాంతో రోహిత్ క్రీజు వెలుపలికి షాట్ కోసం వచ్చిన సమయంలోనూ బంతి అతని ఫ్యాడ్స్‌పైకి టర్న్ అయ్యింది. అయినప్పటికీ అతడు బంతిని హిట్ చేసి మూల్యం చెల్లించుకున్నాడు.

నటరాజన్‌ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్‌ తర్వాత నట్టూనే!!

Story first published: Saturday, January 16, 2021, 16:45 [IST]
Other articles published on Jan 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X