న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ, రోహిత్ ఉన్నా.. రాహుల్ బ్యాటింగ్ అంటేనే ఇష్టం: లారా

Brian Lara says KL Rahul his my favourite batsman

ముంబై: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత క్రికెటర్లలో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లు. మీ అభిమాన ఆటగాడు ఎవరు అని ఏ దిగ్గజ క్రికెటర్‌ను అడిగినా.. అభిమానిని అడిగినా ఈ ఇద్దరి పేర్లే టక్కున చెపుతారు. అయితే వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రయాన్ లారాను మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అని ప్రశ్నించగా.. ఏమాత్రం ఆలోచించుకోకుండా కేఎల్ రాహుల్ అని చెప్పారు. కోహ్లీ, రోహిత్ కన్నా.. రాహుల్ క్లాస్ బ్యాటింగ్ అంటేనే తనకు ఇష్టం అని చెప్పుకొచ్చారు.

<strong>తమ్ముడు కోహ్లీ ఏం చేస్తున్నావ్‌?.. టీవీ చూస్తున్న సోదరా!!</strong>తమ్ముడు కోహ్లీ ఏం చేస్తున్నావ్‌?.. టీవీ చూస్తున్న సోదరా!!

రాహుల్ క్లాస్ ఆటగాడు:

రాహుల్ క్లాస్ ఆటగాడు:

ప్రస్తుతం ముంబైలో ఉన్న బ్రయాన్‌ లారా సోమవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత తరంలో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అని లారాను ప్రశ్నించగా.. కేఎల్ రాహుల్ అని టక్కున చెప్పారు. 'రాహుల్ క్లాస్ ఆటగాడు. అతని క్లాస్ అంటేనే చాలా ఇష్టం. అతడు తన బ్యాట్‌తో అందరిని అలరిస్తాడు. రాహుల్ మంచి ఎంటర్టైనర్' అని లారా వివరణ ఇచ్చారు. క్రికెట్ ప్రపంచంలో చాలా మంది అద్భత బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. వారిలో స్టీవ్‌ స్మిత్, కోహ్లీ, రోహిత్ ముందు వరుసలో ఉన్నారు. కానీ.. నా ఫేవరెట్ మాత్రం రాహుల్ అని పేర్కొన్నారు.

కోహ్లీ తర్వాత ఆ స్థాయిలో ఆడే సత్తా రాహుల్‌కు ఉంది

కోహ్లీ తర్వాత ఆ స్థాయిలో ఆడే సత్తా రాహుల్‌కు ఉంది

న్యూజిలాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్లలో విశేషంగా రాణించిన కేఎల్ రాహుల్.. టెస్ట్ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. దీనిపై లారా స్పందిస్తూ... 'రాహుల్‌కు టెస్టు జట్టులో ఎందుకు స్థానం కల్పించలేదో నాకు తెలియదు. అతని టెక్నిక్, బ్యాటింగ్ చేసే విధానం చూస్తే.. ఏ జట్టులోనైనా రాహుల్‌ అడగలడు. అతనికి ఏ ఫార్మాట్‌లో అయినా ఆడే నైపుణ్యాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ తర్వాత ఆ స్థాయిలో ఆడే సత్తా రాహుల్‌కు మాత్రమే ఉంది' అని లారా చెప్పుకొచ్చారు.

నా చిన్నప్పుడు టెస్ట్ మ్యాచ్‌ అంటే:

నా చిన్నప్పుడు టెస్ట్ మ్యాచ్‌ అంటే:

'నా చిన్నప్పుడు టెస్ట్ మ్యాచ్‌ను ప్రతి ఒక్కరూ చూడాలనుకునేవారు. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ వెలుపల వేలాది మంది ఉదయం ఆరు గంటలకే లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండేవారు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. టీ20లు వచ్చాక ఆట ఆకర్షణీయంగా మారింది. కానీ నా ఆందోళన మాత్రం ఒకటే.. టెస్ట్ క్రికెట్‌ను మళ్లీ జనాలు చూసేలా చేయాలి' అని లారా అన్నారు. ప్రస్తుతం బ్రయాన్‌ లారా రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఆడుతున్నారు. వెస్టిండీస్ లెజెండ్స్‌ జట్టుకు విండీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం సారథిగా ఉన్నారు.

 రోజులు కాదు.. ఫలితమే ముఖ్యం:

రోజులు కాదు.. ఫలితమే ముఖ్యం:

'నా దృష్టిలో టెస్టులను ఐదు రోజులు ఆడిస్తారా లేదా నాలుగు రోజులకు కుదిస్తారా అనేది పెద్ద విషయం కాదు. ప్రతీ క్రికెట్‌ అభిమాని ఏదో ఓ ఫలితం కోసమే మాత్రమే మ్యాచ్‌ చూస్తాడు. అంతేకానీ.. టెస్టు ఎన్ని రోజులు సాగిందనే విషయం పట్టించుకోడు. క్రికెట్ అభిమాని తొలి రోజు, ఆఖరి రోజుపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కొందరు అయిదు రోజులు క్రికెట్‌ ఆడాలని భావిస్తారు. అయితే ఆ సందర్భాల్లో కూడా అన్నిసార్లు ఫలితాలు రావు' అని అన్నారు.

Story first published: Tuesday, March 10, 2020, 14:21 [IST]
Other articles published on Mar 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X