న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్లో ఫలితమే ముఖ్యం.. రోజులు కాదు: మాజీ దిగ్గజం

Brian Lara Not Concerned With Duration Of Test, Wants only Result

ముంబై: టెస్టు ఫార్మాట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఐసీసీ చేస్తున్న ప్రయత్నాలపై వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్‌ లారా భిన్నంగా స్పందించారు. టెస్టుల నిడివి గురించి ఎటువంటి ఆందోళన లేదని, ఫలితాలు రావడం ముఖ్యమని, అలా అయితేనే ఆదరణ పెరుగుతుందన్నారు. 2023-31 మధ్య కొత్త భవిష్యత్‌ పర్యటనల ప్రణాళికలో ఐసీసీ నాలుగు రోజుల టెస్టుల ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే లారా మాత్రం బిన్నంగా స్పందించారు.

టోక్యో ఒలింపిక్స్‌కు మేరీకోమ్.. అమిత్‌, సిమ్రన్‌జిత్‌ కూడా!!టోక్యో ఒలింపిక్స్‌కు మేరీకోమ్.. అమిత్‌, సిమ్రన్‌జిత్‌ కూడా!!

రోజులు కాదు.. ఫలితమే ముఖ్యం:

రోజులు కాదు.. ఫలితమే ముఖ్యం:

ప్రస్తుతం ముంబైలో ఉన్న బ్రయాన్‌ లారా మీడియాతో మాట్లాడుతూ... 'నా దృష్టిలో టెస్టులను ఐదు రోజులు ఆడిస్తారా లేదా నాలుగు రోజులకు కుదిస్తారా అనేది పెద్ద విషయం కాదు. ప్రతీ క్రికెట్‌ అభిమాని ఏదో ఓ ఫలితం కోసమే మాత్రమే మ్యాచ్‌ చూస్తాడు. అంతేకానీ.. టెస్టు ఎన్ని రోజులు సాగిందనే విషయం పట్టించుకోడు. క్రికెట్ అభిమాని తొలి రోజు, ఆఖరి రోజుపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కొందరు అయిదు రోజులు క్రికెట్‌ ఆడాలని భావిస్తారు. అయితే ఆ సందర్భాల్లో కూడా అన్నిసార్లు ఫలితాలు రావు' అని అన్నారు.

అభిమానులను ఆకర్షించడం కోసమే:

అభిమానులను ఆకర్షించడం కోసమే:

'డే/నైట్‌ టెస్టులు కేవలం అభిమానులను ఆకర్షించడం కోసమే. కానీ.. గేమ్‌ను ముందుకు తీసుకెళ్లడంతో ఇవి ఉపయోగపడుతుందని నేను అనుకోను. నేటితరం టెస్టులపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. కానీ.. మునపటిలా టెస్టులపై ఆసక్తి తీసుకురావాల్సి ఉంది. దీనికి ఏం చేయాలో ఆలోచించాలి. అయితే మంచి టెస్టు మ్యాచ్‌ను చూస్తే అందరూ ఎంతగానో ఆస్వాదిస్తారు. అది ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది' అని లారా పేర్కొన్నారు.

17 పరుగులు చేసిన లారా:

17 పరుగులు చేసిన లారా:

ప్రస్తుతం బ్రయాన్‌ లారా రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఆడుతున్నారు. వెస్టిండీస్ లెజెండ్స్‌ జట్టుకు విండీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం సారథిగా ఉన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు నిధుల సేకరణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం వరల్డ్‌ సిరీస్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా శనివారం వాంఖేడే స్టేడియం వేదికగా ఇండియా లెజెండ్స్‌-వెస్టిండీస్‌ లెజెండ్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ లెజెండ్స్‌ 8 వికెట్లకు 150 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇండియా లెజెండ్స్‌ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు చేసి నెగ్గింది. లారా 17 పరుగులు చేసారు.

Story first published: Tuesday, March 10, 2020, 9:19 [IST]
Other articles published on Mar 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X