న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Brett Lee : టీ20 ప్రపంచకప్‌కు టీమిండియాలో ఆ పేసర్ ఉండాల్సింది, ఆసీస్ జట్టులో ఆ ఆల్రౌండర్ ఉండాల్సింది

Brett Lee Felt that Umran Malik should Have Selected for T20 World cup

ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఇండియా జట్టులో ఓ పేసర్, ఆస్ట్రేలియా జట్టులో ఆ ఓ ఆల్రౌండర్‌ను తీసుకోకపోవడం పట్ల మాజీ ఆస్ట్రేలియా ప్లేయర్ బ్రెట్‌లీ తన నిరాశను వ్యక్తం చేశాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ - 2022లో భాగంగా ఆస్ట్రేలియా లెజెండ్స్ తరఫున ఇటీవల బ్రెట్ లీ ఆడిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఆసీస్ పిచ్‌లు పేస్‌కు, ఎక్స్‌ట్రా బౌన్స్‌ను అందిస్తాయి కాబట్టి ఉమ్రాన్ మాలిక్ లాంటి ప్లేయర్ ఉండుంటే ఇండియాకు ప్లస్ అయ్యేదని బ్రెట్ లీ పేర్కొన్నాడు. 22 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్ ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌ తరఫున ఐర్లాండ్‌తో జరిగిన టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అయితే అతను ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో ఆడిన మూడు మ్యాచ్‌లలో చాలా ఎక్స్ పెన్సివ్ బౌలింగ్ వేశాడు. తర్వాత అతనికి అవకాశాలు దక్కలేదు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో అతని ప్రదర్శన అత్యుత్తమంగా ఉంది. అతను సన్ రైజర్స్ తరఫున చెలరేగాడు. అందువల్లే అతను అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టుకు సెలెక్ట్ కాగలిగాడు. 150కి.మీ వేగంతో బంతులు సంధించడం ఉమ్రాన్ మాలిక్ స్పెషాలిటీ. అందువల్ల టీ20 ప్రపంచకప్ టోర్నీలో అలాంటి బౌలర్ భారత జట్టులో ఉండాలని బ్రెట్ లీ కోరుకున్నాడు.

 స్పీడ్ చూసైనా తీసుకోవాల్సింది

స్పీడ్ చూసైనా తీసుకోవాల్సింది

'నేను ఆస్ట్రేలియా పరిస్థితుల్లో ఉమ్రాన్ మాలిక్‌ను ఆడించాలని అనుకుంటా. కానీ అతను భారత జట్టులో లేకపోవడం పట్ల నేను షాక్ అవుతున్నాను. అతని స్పీడ్ చూసైనా తీసుకోవాల్సింది. ఆసీస్ కండీషన్లలో అలాంటి స్పీడ్ పేస్ ఉంటే ప్రత్యర్థి బ్యాటర్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ' అని బ్రెట్ లీ అన్నాడు. ఇక ఇటీవల టీ20ల్లో మెరుస్తున్న ఆసీస్ బౌలర్ కామెరాన్ గ్రీన్ గురించి కూడా బ్రెట్ లీ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్ ఆసీస్ జట్టులో గ్రీన్ ఉండాల్సిందని లీ అభిప్రాయపడ్డాడు. అతను జట్టులో లేకపోవడం ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది అని బ్రెట్ లీ తెలిపాడు.

 డెత్ బౌలింగ్ స్పెషలిస్టు లేకపోవడం పెద్ద లోటు

డెత్ బౌలింగ్ స్పెషలిస్టు లేకపోవడం పెద్ద లోటు

టీ20 ప్రపంచకప్ నుంచి గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడంతో భారత్‌కు నిఖార్సైన డెత్ బౌలర్ లేకుండా పోయాడు. డెత్ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్ తీవ్రంగా విఫలమవుతున్నాడు. ప్రస్తుతం భారత్ జట్టులో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. యువ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ ఆసియా కప్‌లో డెత్ ఓవర్లలో రాణించినా.. అతను దక్షిణాఫ్రికాతో సిరీస్లో మాత్రం తేలిపోయాడు. అతను ఇటీవల గాయపడడంతో టీ20 ప్రపంచకప్ టైంకు అందుబాటులో ఉంటాడో ఉండడో కూడా గ్యారెంటీ లేదు. ఇకపోతే జట్టుకు అందుబాటులో ఉన్నా అతను ప్లేయింగ్ XIలో ఉండే అవకాశాలు కూడా తక్కువే. ఇక జట్టుకు మిస్సయిన బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ లేదా దీపక్ చాహర్ వచ్చే అవకాశం ఉంది.

ఆసీస్‌లో పేస్, బౌన్స్ కీలకం.. స్వింగ్ కాదు

ఆసీస్‌లో పేస్, బౌన్స్ కీలకం.. స్వింగ్ కాదు

ఇకపోతే బ్రెట్ లీ అభిప్రాయం ప్రకారం.. ఆసీస్ పిచ్‌లలో డెత్ ఓవర్లలో స్పీడ్‌స్టర్‌లు మ్యాజిక్‌ను సృష్టించగలరని, స్వింగ్ బౌలర్లతో పని కాదని పేర్కొన్నాడు. అదనపు బౌన్స్ పెడే ఆస్ట్రేలియా పరిస్థితులలో మంచి పేస్ జనరేట్ చేయగల ప్లేయర్ల అవసరం ఎంతైన ఉందని తెలిపాడు. బ్రెట్ లీ మాట్లాడుతూ.. 'ఆసీస్లో పేస్, బౌన్స్ చాలా కీలకం. మీరు డెత్‌లో సరైన పేస్‌ జనరేట్ చేస్తూ లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేసినట్లయితే తప్పకుండా అది యాడ్ ఆన్ అడ్వంటేజీ అవుతుంది. కాబట్టి ముందు మంచి పేస్ జనరేట్ చేయగలగాలి. మీరు మీ ప్లాన్‌లను ఎంత బాగా డెలివరీ చేస్తారు, అమలు చేస్తారనేదానిపై అనే దానిపై మీ బౌలింగ్ స్టాండర్డ్స్ ఆధారపడి ఉంటాయి. బ్యాట్స్‌మెన్స్ అదనపు బౌన్స్ ఆడడంపై ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఉపఖండంలోని బ్యాటర్లు షియర్ పేస్, బౌన్స్‌కు అలవాటు పడి ఉండరు' అని బ్రెట్ లీ చెప్పాడు.

Story first published: Thursday, October 6, 2022, 15:24 [IST]
Other articles published on Oct 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X