న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ 100 సెంచరీల రికార్డ్‌ని కోహ్లీ మాత్రమే బ్రేక్ చేయగలడు: మాజీ స్పిన్నర్

Brad Hogg says Virat Kohli can break Sachin Tendulkars record of 100 centuries


సిడ్నీ:
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డ్‌ను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేయగలడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ జోస్యం చెప్పాడు. ఇప్పటికే వన్డే, టెస్టుల్లో కలిపి 70 సెంచరీలు నమోదు చేసిన కోహ్లీ.. గత కొన్నేళ్లుగా అద్భుత ప్రదర్శనని కనబరుస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో రికార్డుల్ని తన పేరిట లిఖించుకున్న ఈ పరుగుల యంత్రం.. రికార్డుల రారాజుగా అందరి నుంచి కితాబులు అందుకుంటున్నాడు. దీంతో సచిన్ 100 సెంచరీల రికార్డుని కోహ్లీ బ్రేక్ చేయడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నెం.1 స్థానంలో సచిన్:

నెం.1 స్థానంలో సచిన్:

సచిన్ టెండూల్కర్ సాధించిన 100 సెంచరీలలో.. 49 శతకాలు వన్డేల్లో సాధించాడు. మిగిలిన 51 శతకాలు టెస్టుల్లో నమోదు చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఇప్పటికే వన్డేల్లో 43 సెంచరీల మైలురాయిని అందుకుని సచిన్ రికార్డ్‌కి చేరువయ్యాడు. ఇక టెస్టుల్లో విరాట్ సాధించిన శతకాలు 27 మాత్రమే. అయితే సచిన్ తరహాలో సుదీర్ఘంగా కెరీర్‌ని, ఇప్పటి ఫామ్‌ను ఇలానే కొనసాగించగలిగితే.. కోహ్లీ 100 సెంచరీలు నమోదు చేయగలడు అని బ్రాడ్ హగ్ వెల్లడించాడు. మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఆటగాళ్లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతున్నారు కాబట్టి 100 సెంచరీల రికార్డ్‌ను కోహ్లీ బ్రేక్ చేయగలడన్నాడు.

రికార్డు బ్రేక్ చేయగలడు:

రికార్డు బ్రేక్ చేయగలడు:

తాజాగా బ్రాడ్ హగ్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ కచ్చితంగా 100 సెంచరీల రికార్డుని బ్రేక్ చేయగలడు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడే రోజుల్లో ఫిట్‌నెస్ లెవల్స్‌తో పోలిస్తే ఇప్పుడు.. ఫిట్‌నెస్ ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు జట్టు‌లో ఫిట్‌నెస్ ట్రైనర్, ఫిజియో, డాక్టర్ రూపంలో అందరూ ఆటగాళ్లకి అందుబాటులో ఉన్నారు. క్రికెటర్‌కి ఏ చిన్న గాయమైనా.. వాళ్లు వెంటనే కేర్ తీసుకుంటున్నారు. ఇవన్ని కాకుండా.. మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఆటగాళ్లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతున్నారు కాబట్టి సచిన్ రికార్డ్‌ని కోహ్లీ బ్రేక్ చేయగలడు. ప్రస్తుత రికార్డులను చూస్తే.. కోహ్లీకి మాత్రమే ఆ అవకాశం ఉంది' అని అన్నాడు.

కోహ్లీకి అంత ఈజీ కాదు:

కోహ్లీకి అంత ఈజీ కాదు:

100 సెంచరీల రికార్డ్‌ను అధిగమించడం విరాట్ కోహ్లీకి అంత ఈజీ కాదని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. కాకపోతే విరాట్ ఆ ఫీట్‌ను అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. 'వంద సెంచరీ రికార్డును కోహ్లీ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నా. కాకపోతే అది చాలా కష్టమైన పని. వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల (43) రికార్డ్‌ని బ్రేక్ చేయడం కోహ్లీకి సాధ్యమే. కానీ 100 సెంచరీల రికార్డ్‌ని బ్రేక్ చేయడం మాత్రం అంత సులువు కాదు. ఆ రికార్డ్ అధిగమించడం అనేది కోహ్లీ ఫిట్‌నెస్‌, కెరీర్‌ను కొనసాగించడంపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ సచిన్ తరహాలో సుదీర్ఘ కెరీర్‌ని (24 ఏళ్లు) కోహ్లీ కొనసాగించగలిగితే అతను 100 సెంచరీల రికార్డ్‌ని సాధించగలడు' అని ఇర్ఫాన్ వెల్లడించాడు.

 రెండో స్థానంలో పాంటింగ్:

రెండో స్థానంలో పాంటింగ్:

24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు నమోదు చేశాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కి సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినా.. ఇప్పటికీ క్రికెట్ ప్రపంచంలో 100 సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 71 అంతర్జాతీయ శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రికీ టెస్టుల్లో 41, వన్డేల్లో 30 సెంచరీలు బాదాడు. ఇక మూడో స్థానంలో కోహ్లీ ఉన్నాడు. రికీని అధిగమించడం కొద్ది రోజుల్లోనే మనం చూడవచ్చు.

ఈడెన్ మైదాన సిబ్బందికి కరోనా.. క్యాబ్ ఆఫీస్ మూసివేత!!

Story first published: Monday, July 6, 2020, 10:35 [IST]
Other articles published on Jul 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X