న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పంత్‌ కొన్ని స్టంపింగ్‌లు వదిలేసినా.. టెస్టుల్లో అతడినే ఎంపికచేయాలి'

Brad Hogg Reveals Who Should Keep Wickets For TeamIndia Among Rishabh Pant, KL Rahul, Wriddhiman Saha

సిడ్నీ: సీనియర్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా కన్నా యువ కీపర్ రిషబ్ ‌పంత్‌ ఏవో కొన్ని స్టంపింగ్‌లు వదిలేసినా.. టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం అతడినే ఎంపికచేయాలని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్‌ హాగ్‌ సూచించాడు. పంత్‌ తన బ్యాటింగ్‌తో సాహా కంటే జట్టును పరుగుల విషయంలో మరింత ముందుకు తీసుకెళతాడన్నాడు. ఇక లోకేష్ రాహుల్‌ను టెస్టుల్లో ఎంపిక చేద్దన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ భవితవ్యంపై సందిగ్ధత నెలకొన్న పరిస్థితుల్లో ఆ స్థానాన్ని భర్తీ చేయడంలో బీసీసీఐ సెలెక్టర్లు మల్లగుల్లాలు పడుతున్న విషయం తెలిసిందే.

సాహా టెస్టుల్లో మంచి కీపర్

సాహా టెస్టుల్లో మంచి కీపర్

తాజాగా బ్రాడ్‌ హాగ్‌ మాట్లాడుతూ భారత జట్టుకు ఏయే ఫార్మాట్‌లో ఎవరెవరు ఉండాలో వివరించాడు. 'సాహా టెస్టుల్లో మంచి కీపర్‌. బంతి తన వద్దకు వచ్చేంత వరకు ఓపిగ్గా ఉంటాడు. అలాగే చాలా చురుగ్గా వ్యవహరిస్తాడు. స్టంపింగ్‌ చేయడం, లెగ్‌సైడ్‌ కదలడంతో పాటు క్యాచ్‌లు పట్టడంలోనూ నిరాశపర్చడు. రాహుల్‌ ఇటీవల న్యూజిలాండ్‌ పర్యటనలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సాహా లాగే చురుగ్గా కదులుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు బాగా రాణిస్తున్నాడు. ‌పంత్.. ‌ రాహుల్‌, సాహా కన్నా చాలా వేగంగా బంతిని అందుకుంటాడు. కానీ కీలక సమయాల్లో ఒత్తిడికి గురౌతాడు' అని అన్నాడు.

సుదీర్ఘ ఫార్మాట్‌కు పంత్‌నే ఎంచుకుంటా

సుదీర్ఘ ఫార్మాట్‌కు పంత్‌నే ఎంచుకుంటా

'అత్యుత్తమ కీపర్‌ అంటే.. నేను రాహుల్‌ను టెస్టుల్లో ఎంపిక చేయను. ఈ ఫార్మాట్‌లో అతడు అంతగా రాణించలేడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు సాహా లేదా పంత్‌ను ఎంచుకోవాలి. అయితే ఈ ఇద్దరిట్లో మాత్రం నేను పంత్‌నే ఎంచుకుంటా. సాహా కంటే అతడు దూకుడుగా ఆడతాడు. భారత జట్టులోని టాప్‌ ఐదుగురు బాగా ఆడతారు. కాబట్టి ఏడో స్థానంలో వచ్చే ఆటగాడు దూకుడుగా ఆడి మ్యాచ్‌ను త్వరగా ముందుకు తీసుకెళ్లాలి. అది బౌలర్లకు ప్రయోజనకరం. టెస్టుల్లో అదే కావాలి. సాహా కన్నా పంత్‌ కొన్ని స్టంపింగ్‌లు వదిలేసినా అతడినే ఎంపికచేయాలి' అని బ్రాడ్‌ హాగ్‌ సూచించాడు.

పొట్టి ఫార్మాట్‌లో రాహుల్ సరైనోడు

పొట్టి ఫార్మాట్‌లో రాహుల్ సరైనోడు

'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్‌ దూకుడుగా ఆడతారనుకోవచ్చు. అయితే దాన్ని నేను వన్డేల వరకే పరిగణిస్తా. టీ20ల్లో కాదు. అలాగని సాహాని కూడా ఎంపిక చేయను. అతనికంత స్ట్రైక్‌రేట్‌ లేదు. పంత్‌, రాహల్‌ లాగా బౌండరీలు సాధించలేడు. కాబట్టి పొట్టి ఫార్మాట్‌లో నేను రాహుల్‌ను ఎంచుకుంటా. పంత్‌ టెస్టులకు సరిపోతాడు. సాహా మంచి బ్యాకప్‌ కీపర్‌గా ఉంటాడు. పంత్‌ రాబోయే కాలంలో మూడు ఫార్మాట్లలోనూ ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు. అతడే కీలక ఆటగాడిగా మారతాడు. అయితే అతడి ఆటను మెరుగు పర్చుకోవాలంటే కాస్త కష్టపడాలి. మంచి కోచ్‌ అతడికి సహాయపడాలి' అని హాగ్‌ చెప్పుకొచ్చాడు.

ముగ్గురి మధ్య తీవ్ర పోటీ

ముగ్గురి మధ్య తీవ్ర పోటీ

ఎంఎస్ ధోనీ భవితవ్యంపై సందిగ్ధత నెలకొన్న పరిస్థితుల్లో ఆ స్థానాన్ని భర్తీ చేయడంలో భారత సెలక్టర్లకు మున్ముందు తలనొప్పి ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టెస్టుల్లో మంచి పేరు తెచ్చుకున్న సాహా.. ఆ ఫార్మాట్‌లో ధోనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు పంత్‌ 2018లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పర్యటన టెస్టుల్లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇటీవల కేఎల్‌ రాహుల్‌ సైతం కివీస్‌ పర్యటనలో కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా ఆకట్టుకోవడంతో ఆ స్థానంపై ఆసక్తి నెలకొంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

నన్ను అరెస్ట్ చేసి టెర్రరిస్ట్ వార్డులో ఉంచారు.. నరకం అనుభవించా: టీమిండియా పేసర్

Story first published: Thursday, July 2, 2020, 17:02 [IST]
Other articles published on Jul 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X