న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అచ్చం అదే డ్యాన్స్ మూమెంట్: బాక్సింగ్ డే టెస్టులో మైకేల్ జాక్సన్‌ను తలపించిన వేడ్!

Boxing Day Test: Matthew Wade just literally did a Michael Jackson move at the MCG!

హైదరాబాద్: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) వేదికగా ప్రతిష్టాత్మక బాక్సింగ్ డే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఆతిథ్య జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, కివీస్ బౌలర్ల బౌన్సర్లు, యార్కర్లను ఎదుర్కొనే క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ వేడ్ ఫేమస్ పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ మాదిరి ఫోజు పెట్టాడు.

జట్టు స్కోరు 144 పరుగుల వద్ద లబుషేన్(63) ఔటైన తర్వాత మాథ్యూ వేడ్ క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే న్యూజిలాండ్ పేసర్ నీల్ వాగ్నెర్, కివీస్ పేసర్లు టిమ్ సౌథీల బంతులను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో మాథ్యూ వేడ్‌ను ఇబ్బంది పెట్టేందుకు గాను వీరు యార్కర్లు, బౌన్సర్లతో విరుచుకుపడ్డారు.

<strong>Year end 2019: టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన టాప్-3 బౌలర్లు వీరే!</strong>Year end 2019: టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన టాప్-3 బౌలర్లు వీరే!

బౌన్సర్లు, యార్కర్లను ఎదుర్కొనే క్రమంలో

బౌన్సర్లు, యార్కర్లను ఎదుర్కొనే క్రమంలో

అయితే, ఈ బౌన్సర్లు, యార్కర్లను ఎదుర్కొనే క్రమంలో వేడ్ క్రీజులో సరికొత్త భంగిమలను పెట్టాడు. అయితే, ఇందులో ఒకటి అచ్చం మైకేల్ జాక్సన్ డ్యాన్స్ మూమెంట్‌ని తలపించింది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఆ ఫోజుని తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ "వేడ్ నువ్వు బాగున్నారా? నువ్వు బాగున్నారా, వేడ్?" అంటూ కామెంట్ పెట్టింది.

వేడ్ ఫోటో పక్కనే

వేడ్ ఫోటో పక్కనే

అంతేకాదు వేడ్ ఫోటో పక్కనే మైకేల్ జాక్సన్ డ్యాన్స్ మూమెంట్‌ని జత చేర్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే, తొలిరోజు ఆతిథ్య జట్టే పైచేయి సాధించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్(77), ట్రావిస్ హెడ్(25) పరుగులతో ఉన్నారు.

స్మిత్, లబుషేన్‌లు హాఫ్ సెంచరీలు

స్మిత్, లబుషేన్‌లు హాఫ్ సెంచరీలు

తొలిరోజు ఆటలో భాగంగా స్టీవ్ స్మిత్, లబుషేన్‌లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ హాఫ్ సెంచరీ సాధించడంతో పాటు ఆస్ట్రేలియా తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గ్రెగ్ చాపెల్(7110) రికార్డుని అధిగమించాడు. అంతేకాదు స్టీవ్ స్మిత్ టాప్-10 జాబితాలో చేరిపోయాడు.

ఆస్ట్రేలియా తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు:

ఆస్ట్రేలియా తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు:

13,378 - RT Ponting

11,174 - AR Border

10,927 - SR Waugh

8643 - MJ Clarke

8625 - ML Hayden

8029 - ME Waugh

7696 - JL Langer

7525 - MA Taylor

7422 - DC Boon

7111 - SPD SMITH*

7110 - GS Chappell

టీ విరామానికి 155/3

టీ విరామానికి 155/3

టీ విరామానికి 155/3తో నిలిచిన ఆస్ట్రేలియా ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడింది. వేడ్-స్మిత్‌లు యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, జట్టు స్కోరు 216 పరుగుల వద్ద మాథ్యూ వేడ్(38) గ్రాండ్ హోమ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

తొలి రోజు పెద్ద ఎత్తున హాజరైన అభిమానులు

తొలి రోజు పెద్ద ఎత్తున హాజరైన అభిమానులు

బాక్సింగ్ డే టెస్టు కావడంతో తొలి రోజు పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. తొలిరోజు మ్యాచ్‌కి 80,473 హాజరు కావడంతో ఎంసీసీలో సందడి వాతావరణం నెలకొంది. చివరగా ఈ రెండు జట్లు 1987లో బాక్సింగ్‌ డే (డిసెంబర్‌ 26) టెస్టులో తలపడ్డాయి. కివీస్ బౌలర్లలో గ్రాండ్‌హోమ్ రెండు వికెట్లు తీయగా... బౌల్ట్, వాగ్నెర్‌లకు చెరో వికెట్ లభించింది.

Story first published: Thursday, December 26, 2019, 16:17 [IST]
Other articles published on Dec 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X