న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్ చేతిలో పాకిస్థాన్ క్లీన్‌స్వీప్: ఇలా చరిత్రలో రెండోసారి

By Nageshwara Rao
Black Caps survive Pakistan comeback to claim series sweep

హైదరాబాద్: స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరిస్‌లో వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను 5-0తో సొంతం చేసుకుంది.

వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. మార్టిన్ గుప్టిల్‌ (100) సెంచరీ సాధించగా, రాస్‌ టేలర్‌(59) హాఫఅ సెంచరీని నమోదు చేశాడు. వన్డేల్లో గుప్టిల్‌కి ఇది 15వ సెంచరీ.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోలిన్‌ మున్రో (34), గ్రాండ్‌ హోమ్‌(29 నాటౌట్‌) దూకుడుగా ఆడారు. అనంతరం 272 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 256 పరుగులకే ఆలాటైంది. 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో పాక్ లోయర్ ఆర్డర్ దూకుడుగా ఆడారు.

పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ హారిస్‌ సోహైల్‌ (63), షాదబ్‌ ఖాన్‌ (54)లు హాఫ్‌ సెంచరీలతో రాణించగా... ఫహీమ్‌ అష్రాఫ్‌ (23), మొహ్మద్‌ నవాజ్‌ (23), అమీర్‌ యామిన్‌ (32 నాటౌట్‌)లతో ఫరవాలేదనిపించారు. ఒకానొక దశలో నిర్దేశిత లక్ష్యాన్ని పాక్ చేధించేలా కనిపించినప్పటికీ, చివర్లో ఓటమి పాలైంది.


ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తన ఇన్నింగ్స్‌ను స్లోగా ప్రారంభించడమే ఓటమికి కారణమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ జట్టు ఇలా 5-0తో సిరిస్‌ను కోల్పోవడం చరిత్రలో ఇది రెండోసారి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 19, 2018, 14:59 [IST]
Other articles published on Jan 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X