న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ వేలం ముందు సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌కు ఎదురు దెబ్బ!

Big blow to Sachin Tendulkars son Arjun Tendulkar before IPL 2021 Auction

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ వేలానికి ముందు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు గట్టి షాక్ తగిలింది.
ఈ నెల 18న చెన్నై వేదికగా జరగనున్న మినీ ఐపీఎల్ వేలానికి ఇప్పటికే పేరు నమోదు చేసుకున్న అర్జున్.. విజయ్‌ హజారే వన్డే ట్రోఫీలో పాల్గొనే ముంబై సీనియర్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ నెల 20న ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం ముంబై క్రికెట్‌ అసోసియేషన్ బుధవారం 22 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ కోసం తొలిసారి ముంబై సీనియర్‌ జట్టుకు ఎంపికైన అర్జున్‌.. ఆ టోర్నీలో రాణించలేకపోయాడు. ఆడే అవకాశం వచ్చిన ఒక్క మ్యాచ్‌లోనూ రెండు ఓవర్లు వేసిన అతను 21 పరుగులు ఇచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు. అంతకుముందు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లోనూ మెప్పించలేకపోయాడు. దాంతో విజయ్‌ హజారే ట్రోఫీ జట్టు నుంచి అతన్ని తప్పించారు.

భుజం గాయం కారణంగా‌ శ్రేయస్‌ అయ్యర్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్‌.. విజయ్‌ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు. అయ్యర్, షా ఇద్దరూ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లలో ఆడట్లేదు. మార్చి 12 నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్, మార్చి 23 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నాయి. ఆ సిరీస్‌ల్లో శ్రేయస్‌ ఆడనున్నాడు. ఇక ముంబై జట్టులో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, యంగ్‌ ఓపెనర్‌ యశస్వి, సర్ఫరాజ్‌ ఖాన్‌, వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ ఆదిత్య తారే, సీనియర్‌ బౌలర్‌ దవల్‌ కులకర్ణి, తుషార్‌ దేశ్‌పాండేతో పాటు ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు.

ఈ టోర్నమెంట్‌ కోసం భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్‌ పవార్‌ను ముంబై జట్టు ప్రధాన కోచ్‌గా ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) మంగళవారం నియమించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో ముంబై పేలవ ప్రదర్శన చేయడంతో కోచ్‌ పదవి నుంచి భారత మాజీ స్పిన్నర్‌ అమిత్‌ పాగ్నిస్‌ తప్పుకున్నాడు. దీంతో ముంబై క్రికెట్‌ కమిటీ కొత్త కోచ్‌గా పవార్‌ను ప్రతిపాదించింది. ఇప్పటికైతే ఈ నియామకం ప్రస్తుత సీజన్‌కు మాత్రమేనని, భవిష్యత్త్‌లో కొనసాగించడాన్ని తర్వాత పరిశీలిస్తామని ఎంసీఏ అధికారి ఒకరు చెప్పారు.

ముంబై జట్టు:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అఖిల్ హెర్వాడ్కర్, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, చిన్మయ్ సుతార్, ఆదిత్య తారే, హార్దిక్ తమోర్, శివం దుబే, ఆకాష్ పార్కర్, అతిఫ్ అంటార్వాలా, షమ్స్ ములన్ సైరాజ్ పాటిల్, సుజిత్ నాయక్, తనూష్ కోటియన్, ప్రశాంత్ సోలంకి, ధవల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే, సిద్ధార్థ్ రౌత్, మోహిత్ అవస్థీ.

Story first published: Thursday, February 11, 2021, 11:09 [IST]
Other articles published on Feb 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X