న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాట్ క్రీజులో ఉన్నా... బ్యాట్స్‌మన్‌ను ఔటిచ్చిన థర్డ్ అంపైర్ (వీడియో)

Big Bash League: Third Umpire gives James Pattinson out; opponents withdraw appeal

హైదరాబాద్: క్రికెట్‌లో అంపైర్లు తీసుకున్న నిర్ణయాలు అభిమానులను అప్పుడప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔట్ ఇలానే వివాదస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాస్ లీగ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆశ్చర్యం కలిగించలేదు: తొలి రౌండ్‌లో కోనుగోలు చేయకపోవడంపై యువరాజ్ ఆశ్చర్యం కలిగించలేదు: తొలి రౌండ్‌లో కోనుగోలు చేయకపోవడంపై యువరాజ్

రనౌట్ అప్పీల్‌ను టీవీలో పరిశీలించిన థర్డ్ అంపైర్ దానిని ఔట్‌గా ప్రకటించాడు. రిప్లైలో బ్యాట్ సగం వరకు క్రీజులోకి వచ్చిన తర్వాత కీపర్ స్టంప్స్‌ను పడగొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా... థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడం క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌తో పాటు, మ్యాచ్ వీక్షిస్తోన్న అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

బిగ్ బాస్ లీగ్‌లో భాగంగా

బిగ్ బాస్ లీగ్‌లో భాగంగా

బిగ్ బాస్ లీగ్‌లో భాగంగా బుధవారం రాత్రి బ్రిస్బేన్ హీట్, అడిలైడ్ స్ట్రైకర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓ రనౌట్ వివాదాస్పదమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో జిమ్మీ పియర్సన్, జేమ్స్ ప్యాటిన్సన్ క్రీజులోకి వచ్చారు.

సింగిల్ కోసం యత్నించిన పియర్సన్

సింగిల్ కోసం యత్నించిన పియర్సన్

పియర్సన్ స్ట్రైకింగ్ చేస్తుండగా మరో ఎండ్‌లో ప్యాటిన్సన్ ఉన్నారు. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్ వేసిన బంతిని పియర్సన్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. దీంతో ప్యాటిన్సన్ డైవ్ చేసుకుంటూ క్రీజులోకి అడుగుపెట్టాడు. ఇదే సమయంలో అడిలైడ్ స్ట్రైకర్స్ వికెట్ కీపర్ అలెక్స్ కారే బేల్స్‌ను గిరాటేశాడు. దీంతో నిర్ణయం థర్డ్ అంపైర్‌ వెళ్లింది.

థర్డ్ అంపైర్ ఔట్‌గా

టీవీ రిప్లైలో బ్యాట్ క్రీజులో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. దీంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే, థర్డ్ అంపైర్ పొరపాటున తప్పు బటన్ నొక్కడంతో ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించిన ప్రత్యర్థి జట్టు కెప్టెన్ కొలిన్ ఇన్‌గ్రామ్.. ప్యాటిన్సన్‌ను మళ్లీ క్రీజులోకి రమ్మన్నాడు.

థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంతో

అయితే, థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంతో మ్యాచ్‌ని వీక్షిస్తోన్న అభిమానుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. అయితే, ఆ తర్వాత మ్యాచ్ సజావుగానే సాగింది. ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్‌పై అడిలైడ్ స్ట్రైకర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Thursday, December 20, 2018, 13:03 [IST]
Other articles published on Dec 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X