న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇక నుంచి టాస్ వేయడానికి కాయిన్ బదులు బ్యాట్!!

Big Bash League: Bat flip to replace coin toss for 2018-19

న్యూఢిల్లీ: జనరేషన్‌తో పాటుగా మారుతున్న ట్రెండ్‌లను క్రికెట్‌లోకి చొప్పిస్తున్నారు. ఇలా చేయడంలో బీబీఎల్(బిగ్ బాష్ లీగ్) ట్రెండీగా వ్యవహరిస్తోంది. గతంలో బంతి తాకగానే వెలుతురు వచ్చేలా ఎల్ఈడీ వికెట్ల(జింగ్స్ స్టంప్స్‌)ను క్రికెట్‌కు పరిచయం చేసింది. అప్పటి నుంచి ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లలోనూ ఈ స్టంప్స్‌ను వాడుతున్నారు. ఇదే పంథాలో ఇప్పుడు మరో కొత్త పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకూ కాయిన్‌తో టాస్ వేసే పద్ధతిని మారుస్తూ బ్యాట్‌తోనే టాస్ నిర్ణయించనున్నారట.

‘మౌంటేన్‌’ అని లేదా ‘ప్లైన్‌’ అని

‘మౌంటేన్‌’ అని లేదా ‘ప్లైన్‌’ అని

క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్వహిస్తోన్న బిగ్ బాష్ లీగ్‌లో ఈ సరికొత్త విధానానికి తెరలేవనుంది. ఎలాగంటే.. ఆతిథ్య జట్టు కెప్టెన్‌ బ్యాట్‌ను కాయిన్‌ లాగా తిప్పుతూ గాల్లోకి వేస్తాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ ‘మౌంటేన్‌' అని లేదా ‘ప్లైన్‌' అని చెబుతాడు. అతడు చెప్పినట్లు బ్యాట్‌ పడితే టాస్‌ గెలిచినట్లే. ఇక దానిని బట్టి బ్యాటింగ్.. బౌలింగా అని నిర్ణయించుకుంటారు.

మేం సంతోషపడుతుంటే.. ఇషాంత్ కోపంతో ఊగిపోతున్నాడు: కోహ్లీ

కాయిన్‌తో టాస్‌ వేయడం పిల్లల పని

కాయిన్‌తో టాస్‌ వేయడం పిల్లల పని

‘ఇది ఒక గొప్ప మార్పు. ఈ విధానం వల్ల బీబీఎల్‌ ప్రత్యేకత చాటి చెప్పవచ్చు. కాయిన్‌తో టాస్‌ వేయడం పిల్లలు చేసే పని. గతంలో టాస్‌ను బ్యాట్‌తోనే నిర్ణయించేవారు' అని బీబీఎల్‌ నిర్వాహకుడు కిమ్‌ మెక్కొనే పేర్కొన్నారు.

మొదటి ఆటగాడిగా బ్రిస్బేన్‌ హీట్‌ కెప్టెన్‌ క్రిస్‌ లిన్‌

మొదటి ఆటగాడిగా బ్రిస్బేన్‌ హీట్‌ కెప్టెన్‌ క్రిస్‌ లిన్‌

ఇలా బ్యాట్‌తో టాస్‌ వేయబోయే మొదటి ఆటగాడిగా బ్రిస్బేన్‌ హీట్‌ కెప్టెన్‌ క్రిస్‌ లిన్‌ నిలవనున్నాడు. డిసెంబరు 19న అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరగనున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌ ఈ సరికొత్త పద్ధతికి వేదిక కానుంది. ‌

Story first published: Tuesday, December 11, 2018, 10:14 [IST]
Other articles published on Dec 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X