న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెట్‌ డాగ్‌తో క్యూట్‌ ఫోటో.. సేమ్‌ ఫోజ్‌!!

Bhuvneshwar Kumar Shares Adorable Pictures With His Dog

న్యూఢిల్లీ: గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం పరితపిస్తున్న విషయం తెలిసిందే. గత మార్చి నెలలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌తో భువనేశ్వర్ పునరాగమనం చేయాల్సి ఉండగా.. వర్షం, కరోనా వైరస్ మహమ్మారితో ఆ సిరీస్ తుడిచిపెట్టుకుపోయింది. వైరస్ దెబ్బకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ‌తో సహా అన్ని క్రికెట్ టోర్నీలు రద్దయ్యాయి. దీంతో ఈ ఖాళీ సమయాన్ని ఈ స్వింగ్ కింగ్ ఫ్యామీలీతో సరదాగా గడుపుతున్నాడు.

సెంచరీ కొట్టిన తర్వాతే రిటైర్మెంట్: లియాండర్‌ పేస్‌సెంచరీ కొట్టిన తర్వాతే రిటైర్మెంట్: లియాండర్‌ పేస్‌

శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన పెట్‌ డాగ్‌తో దిగిన క్యూట్‌ ఫోటోలను భువనేశ్వర్ కుమార్ షేర్‌ చేశాడు. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి గుర్తుగా ఈ ఫోటోలను పెట్టానంటూ భూవీ పేర్కొన్నాడు. 'బడ్డీస్‌ దెన్‌ అండ్‌ నౌ' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. షేర్‌ చేసిన రెండు ఫోటోల్లోనూ భూవీ, తన పెంపుడు కుక్క అలెక్స్‌ సేమ్‌ ఫోజ్‌ పెట్టారు. అందులో ఒకటి అలెక్స్‌ చిన్నగా ఉన్నప్పుడు లాన్‌లో తీయగా.. రెండోది తాజాగా తన ఇంట్లో తీశాడు. ఫోటోలో అలెక్స్‌, భూవీలు ఎదురెదురుగా కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం.. దాదాపు రెండు ఫోటోలు ఒకేలా ఉన్నాయి.

భూవీ పోస్టుపై అతని సతీమణి నుపుర్‌ నగర్‌ స్పందించారు. 'మై లవ్‌. మీరిద్దరు అప్పుడు.. ఇప్పుడు ఒకేలా ఫోజు ఇవ్వడం ఎలా సాధ్యం. అద్భుతంగా ఉంది. అలెక్స్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ రెండు ఫోటోల్లోనూ ఒకేలా ఉన్నాయి. నీ పెట్‌ డాగ్‌కు మంచి ట్రైనింగ్‌ ఇచ్చావు భూవీ' అంటూ నుపుర్‌ కామెంట్ రాసుకొచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫోటోలు షేర్‌ చేసిన గంటలోనే లక్ష లైకులు రావడం విశేషం. భూవీ అభిమానులు కూడా సో క్యూట్‌ అంటూ ఎమోజీలు పెడుతున్నారు. భూవీ భారత్ తరపున 114 వన్డేలు, 21 టెస్టులు, 43 టీ20లు ఆడాడు.

ఇక భువనేశ్వర్, నుపుర్‌ నగర్‌‌ల వివాహం 2017 నవంబర్ 23న జరిగిన విషయం తెలిసిందే. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన నుపుర్.. భువీ ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. దీంతో చిన్నప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 13 ఏళ్ల వయసులో భువనేశ్వర్‌ను తొలిసారి కలిశానని నుపుర్‌ ఇటీవల తెలిపారు. పాకిస్థాన్‌తో 2012లో జరిగిన తొలి టీ20లో భువనేశ్వర్ వేసిన స్పెల్ తన పేవరేట్ అని నుపూర్ చెప్పారు.

'పాకిస్థాన్‌పై భువీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పుడు నేను మా స్నేహితులతో హాస్టల్‌లో ఉన్నా. భువీ నా లవర్ అనే విషయం వారికి తెలియదు. అతని బౌలింగ్‌ వారిని చాలా ఇంప్రెస్ చేసింది. ఆ 15 నెంబర్ జెర్సీ ఆటగాడు బాగా బౌలింగ్ చేస్తుండు అని వారంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. 'అని నుపూర్ తన ఫెవరేట్ స్పెల్ గురించి తెలిపారు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 9 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కానీ ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

Story first published: Friday, June 5, 2020, 21:48 [IST]
Other articles published on Jun 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X