న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ పర్యటన నుంచి అర్ధాంతరంగా భారత్‌కు భువీ

By Nageshwara Rao
Bhuvneshwar Kumar To Return Home For Rehabilitation
Bhuvneshwar Kumar to return home for rehabilitation; players unhappy with NCA system

హైదరాబాద్: ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ భారత్‌కు తిరుగు పయనమయ్యాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1 నుంచి ప్రారంభయ్యే టెస్టు సిరిస్ కోసం మొదటి మూడు టెస్టులకు సెలక్టర్లు బుధవారం జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా భువనేశ్వర్ కుమార్ పేరుని ఆ జాబితాలో చేర్చకుండా పరిశీలనలో ఉంచారు.

ఈ మేరకు బీసీసీఐ తన ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. తాజాగా భువీని పరీక్షించిన వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించడంతో అతడు భారత్‌కి తిరుగు పయనమయ్యాడు. ఇంగ్లాండ్ పర్యటన ఆరంభం నుంచి వెన్నునొప్పితో బాధపడుతున్న భువనేశ్వర్ ఇటీవల ముగిసిన మూడో వన్డేలో నొప్పి తీవ్రతరం కావడంతో బౌలింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు.

భువీని గాయం వేధించడంపై పలు అనుమానాలు

భువీని గాయం వేధించడంపై పలు అనుమానాలు

మూడో వన్డేలో భువీని గాయం మరింతగా వేధించడం అనుమానాలకు తావిస్తోంది. గాయమైనప్పటికీ భువీని కావాలనే ఆడించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో విశ్రాంతి ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది. వెన్నునొప్పి కారణంగా అతడికి టెస్టు సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించినట్లు బీసీసీఐ తెలిపింది.

అప్ఘనిస్థాన్‌తో జరిగిన టెస్టుకు భువీ దూరం

అప్ఘనిస్థాన్‌తో జరిగిన టెస్టుకు భువీ దూరం

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున భువనేశ్వర్‌ 17 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా వెన్నునొప్పి గాయం కారణంతో 5 మ్యాచ్‌లకు రిజర్వ్‌బెంచికే పరిమితమయ్యాడు. ఐపీఎల్‌ అనంతరం అప్ఘనిస్థాన్‌తో జరిగిన టెస్టుకు భువీ దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రారంభమైన ఇంగ్లాండ్‌ పర్యటనలో చివరి టీ20, మొదటి రెండు వన్డేలకూ విశ్రాంతినిచ్చారు.

భువీ వందశాతం ఫిట్‌గా లేడు

భువీ వందశాతం ఫిట్‌గా లేడు

అయితే, మూడో వన్డేకు ముందు భువనేశ్వర్‌ వందశాతం ఫిట్‌గా లేడని చెప్పి అతడిని మూడో వన్డేలో ఆడించారు? జట్టు ఫిజియో ఫర్హాన్‌, ఫిజికల్‌ ట్రైనర్‌ శంకర్‌బసులు సరైన ఫిట్‌నెస్‌ నివేదికలను బీసీసీకి సమర్పించారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ ఆ విషయం కోచ్ రవిశాస్త్రిని అడగాలని అన్నారు.

ఈ ఏడాది ఇప్పటివరకు రెండు టెస్టులాడిన భువీ

ఈ ఏడాది ఇప్పటివరకు రెండు టెస్టులాడిన భువీ

ఈ ఏడాది ఇప్పటి వరకు భువనేశ్వర్‌ రెండు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అది కూడా దక్షిణాఫ్రికా జట్టుపైనే వరుసగా ఆడాడు. ఆ సిరీస్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్.. బ్యాట్‌తోనూ 101 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌ తో జరగనున్న తొలి మూడు టెస్టులకు టీమిండియాను సెలక్టర్లు ఇప్పటికే ప్రకటించారు.

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరిస్‌కు ఎంపిక కాని భువీ

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరిస్‌కు ఎంపిక కాని భువీ

మూడు టెస్టులు ముగిసిన అనంతరం లేదా సిరిస్ మధ్యలో మిగిలిన రెండు టెస్టుల కోసం జట్టుని ప్రకటించనున్నారు. అప్పటిలోపు భువీ ఫిట్‌నెస్ సాధిస్తే.. టెస్టు జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు భువీ పూర్తిగా దూరమైనట్లే!

Story first published: Thursday, July 19, 2018, 15:13 [IST]
Other articles published on Jul 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X