న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మంచి విందుతో వదిన మా ఫిట్‌నెస్‌ను పాడు చేస్తోంది: పంత్

India Vs Australia 3rd ODI : Rishabh Pant’s Funny Tweet On MS Dhoni Hosting Dinner At Ranchi
Bhabhiji ruining our fitness levels: Rishabh Pant after dinner at MS Dhonis house

హైదరాబాద్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో వన్డే రాంచీలో జరగనుంది. బుధవారం సాయంత్రమే భారత్‌, ఆస్ట్రేలియా జట్లు అక్కడికి చేరుకున్నాయి. మూడో వన్డే కోసం రాంచీకి వచ్చిన భారత్ జట్టు సభ్యులకు మాజీ కెప్టెన్ ధోనీ దంపతులు అదిరిపోయే విందు ఇచ్చారు. రాంచీ శివార్లలోని తన ఫామ్‌ హౌస్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ధోని అద్భుతమైన రుచులతో కూడిన ఆహారపదార్థాలను ఈ విందులో ఏర్పాటు చేశాడు.

ధోని ఇంట్లో టీమిండియా సందడి: డిన్నర్ అదిరిందంటూ చాహల్ ట్వీట్ధోని ఇంట్లో టీమిండియా సందడి: డిన్నర్ అదిరిందంటూ చాహల్ ట్వీట్

ఈ విందుకు ఈ విందుకు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సహా జట్టు సభ్యులంతా హాజరయ్యారు. అతిథులందరికీ దగ్గరుండి మరి సాక్షి, ధోని క్రికెటర్లందరికీ వడ్డించారు. ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ, ఫొటోలు దిగుతూ ఆద్యంతం ఉత్సాహంగా గడిపిన క్రికెటర్లు ధోనీ దంపతులకు టీమిండియా క్రికెటర్లు ధన్యవాదాలు తెలియజేశారు.

ట్విట్టర్‌లో రిషబ్ పంత్ ఇలా

ఇందుకు సంబంధించిన ఫొటోలను విరాట్ కోహ్లీ, యజువేంద్ర చాహల్, రిషబ్ పంత్‌లు ట్వీట్టర్‌లో పంచుకున్నారు. "చక్కని సాయంత్రం వేళ మంచి విందు ఇచ్చి... బాబీజి (వదిన) మా ఫిట్‌నెస్ స్థాయిలను పాడు చేస్తోంది" అంటూ రిషబ్ పంత్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

కోహ్లీ తన ఇనిస్టాగ్రామ్‌లో ఇలా

"ఈ అందమైన రాత్రి నా సహచర ఆటగాళ్లతో కలిసి మహీ భాయ్‌ ఇంట్లో చేసిన విందుని ఎప్పటికీ మరచిపోలేను. ఈ ఆత్మీయ కలయిక మాలో కొత్త ఉత్తేజాన్ని నింపింది. అం దరం సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. వంటకాలు చాలా బాగున్నాయి" అని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

చాహల్ ఇలా

మహీ భాయ్.. సాక్షి భాబీకి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు.

ధోని తన వాహనంలో

అంతకు ముందు రాంచీ విమానాశ్రయంలో ఆటగాళ్లకు భారీ స్వాగతం లభించింది. కేదార్‌ జాదవ్‌, రిషభ్‌ పంత్‌ తదితరులను ధోనీ స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ తన హమ్మర్‌ వాహనంలో తీసుకెళ్లాడు. బహుశా మిస్టర్‌ కూల్‌కు తన సొంత మైదానంలో ఇదే చివరి వన్డే అని భావిస్తున్నారు. ప్రపంచకప్‌ తర్వాత అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Story first published: Friday, March 8, 2019, 11:49 [IST]
Other articles published on Mar 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X