న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కల చెదిరింది.. ర్యాంకూ చేజారింది !!

 Beth Mooney grabs top spot, Shafali Verma slips to 3rd in ICC Womens T20I Rankings

దుబాయ్: ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో యువ సంచలనం, భారత ఓపెనర్ షెఫాలి వర్మ తన నెంబర్ వన్ ర్యాంక్‌‌‌ను చేజార్చుకుంది. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా ఆదివారం జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో కేవలం 2 పరుగులే చేసి దారుణంగా విఫలమైన ఈ ముంబై సెన్సేషన్ ఏకంగా మూడు స్థానాలను కోల్పోయింది. ఈ మెగా టోర్నీ‌‌లో తన విరోచిత బ్యాటింగ్‌తో జట్టును ఫైనల్‌కు చేర్చడంతో పాటు నెంబర్ వన్ ర్యాంకును అదుకున్న షెఫాలీ.. ఒక్క ఫెయిల్యూర్‌తో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఇక తొలిసారి ఫైనల్ చేరిన భారత అమ్మాయిలు బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమై 85 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

భారత మహిళలను ఎగతాళి చేసిన పాక్ నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మాజీ క్రికెటర్భారత మహిళలను ఎగతాళి చేసిన పాక్ నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మాజీ క్రికెటర్

నెంబర్ వన్‌గా బెత్ మూనీ

నెంబర్ వన్‌గా బెత్ మూనీ

ఇదే ఫైనల్లో భారత్‌పై హాఫ్ సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ ( 54 బంతుల్లో 10 ఫోర్లతో 78 నాటౌట్) నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక సంచలన బ్యాటింగ్‌తో అదరగొట్టిన అలిసా హీలీ(39 బంతుల్లో 75) రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఐదో స్థానం సొంతం చేసుకుంది.

దిగజారిన స్మతి, జెమీమా..

దిగజారిన స్మతి, జెమీమా..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో 762 పాయింట్లతో మూనీ నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌‌కు చెందిన సూజీ బేట్స్ 750 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో షెఫాలి వర్మ 744 పాయింట్లతో ఉండగా.. భారత్‌కే చెందిన ఓపెనర్ స్మృతి మంధాన (661 పాయింట్లు), జెమీమా రోడ్రిగ్స్ (643) వరుసగా 7, 9వ స్థానాల్లో నిలిచారు. హర్మన్ ప్రీత్ కౌర్ 12వ స్థానంలో ఉంది. దీప్తీ శర్మ 10 స్థానాలు ఎగబాకి 43వ ర్యాంకులో నిలిచింది.

బౌలింగ్‌లోనూ..

బౌలింగ్‌లోనూ..

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లోనూ భారత అమ్మాయిలకు నిరాశే ఎదురైంది. దీప్తి శర్మ, రాధ యాదవ్, పూనమ్ యాదవ్ వరుసగా 6, 7, 8 స్థానాల్లో నిలిచారు. మెగా టోర్నీ ఫైనల్లో భారత్ పతనాన్ని శాసించిన జెస్ జొనాసెన్ కెరీర్ బెస్ట్ ర్యాంకును అందుకుంది. 728 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మెగన్ షుట్ తన రెండో ర్యాంకు నిలబెట్టుకోగా.. ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ అగ్రస్థానంలో నిలిచింది.

ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్-5లో దీప్తి శర్మ 302 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌‌లో ఐదోసారి విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది.

కప్ పోయింది.. కన్నీరే మిగిలింది..

కప్ పోయింది.. కన్నీరే మిగిలింది..

ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. అలీసా హెలీ( 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 75), బెత్ మూనీ(54 బంతుల్లో 10 ఫోర్లు 78 నాటౌట్) విధ్వంసతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో దీప్తీ శర్మ(33), వేద కృష్ణమూర్తి (19) టాప్ స్కోరర్లు కావడం గమనార్హం. ప్రధాన బ్యాటర్లు షెఫాలీ (2), మంధాన(11), రోడ్రిగ్స్‌(0), హర్మన్‌(4) ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో మేగన్‌ స్కట్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. జోనాసన్‌ మూడు వికెట్లు తీసింది.

Story first published: Monday, March 9, 2020, 16:06 [IST]
Other articles published on Mar 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X