న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: 'అత్యుత్తమ ఆటగాళ్లు మైదానంలో ఆడుతున్నారు.. చెన్నై జట్టులో నాకు అవకాశం వచ్చినప్పుడు చూద్దాం'

Best players are already on the field: Imran Tahir responds CSK fan question on Twitter

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆటగాళ్ల మధ్య పోటీ అధికంగా ఉంటుంది. అత్యుత్తమ ఫామ్ ఆటగాడు మాత్రమే తుది జట్టులో చోటుదక్కించుకోగలడు. ఇక విదేశీ ప్లేయర్స్ మధ్య కూడా తీవ్ర పోటీ ఉంటుంది. ఒక్కోసారి ఫామ్‌లో ఉన్నా, సీనియర్ ప్లేయర్ అయినా బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి దాదాపు అన్ని జట్లలోనూ ఉంటుంది. కేన్ విలియంసన్, జాసన్ హోల్డర్, మొహ్మద్ నబీ, సునీల్ నరైన్, క్రిస్ లిన్, జేమ్స్ నీశమ్, షెల్డన్ కాట్రేల్, అన్రిచ్ నోర్జ్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ప్రస్తుతం బెంచ్‌లోనే ఉన్నారు. విదేశీ కోటాలో నలుగురు మాత్రమే తుది జట్టులో ఉండడమే వీరికి శాపంలా మారింది.

DC vs MI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై.. యాదవ్ ఇన్! రెండు మార్పులతో బరిలోకి ఢిల్లీ!DC vs MI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై.. యాదవ్ ఇన్! రెండు మార్పులతో బరిలోకి ఢిల్లీ!

బెంచ్‌కే పరిమితం:

చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్ 2019 సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 26 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ను అందుకున్నాడు. అయినా కూడా యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో అతడు ఎక్కువగా మ్యాచులు ఆడలేదు. షేన్ వాట్సన్‌, ఫాఫ్ డుప్లెసిస్‌, డ్వేన్ బ్రేవో, సామ్‌ కరన్‌లకే చెన్నై కెప్టెన్ అవకాశాలు ఇవ్వడంతో తాహీర్‌ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఇక ఐపీఎల్ 2021లో సీఎస్‌కే ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కూడా అతడికి అవకాశం రాలేదు. తాహిర్‌కు తుది జట్టులో స్థానం లభించకపోవడంపై అతని అభిమాని ఒకరు ట్విటర్‌ వేదికగా ప్రశ్నించాడు. తాహిర్‌ సదరు అభిమానికి ధన్యవాదాలు తెలుపుతూ.. రీ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

సిద్ధంగా ఉన్నా:

సిద్ధంగా ఉన్నా:

'మీ అభిమానానికి ధన్యవాదాలు సర్. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తమ అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగుతోంది. ఉత్తమ ఆటగాళ్లు మైదానంలో ఆడుతున్నారు. అంతేకాదు వారు మైదానంలో మంచి ప్రదర్శనను కనబరుస్తున్నారు. జట్టు ప్రయోజనం కోసం వారు కొనసాగాలి. నా ఒక్కడి గురించి కాదు. ఈ అద్భుతమైన జట్టులో భాగం కావడం చాలా గర్వంగా ఉంది. జట్టుకు నా సేవలు అవసరమైనప్పుడు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు సిద్ధంగా ఉన్నా' అని ఇమ్రాన్‌ తాహిర్ సదరు అభిమానికి స్పష్టం చేశాడు. తాహిర్ సమాధానంపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'టీమ్ మ్యాన్', 'సూపర్ కింగ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

పంజాబ్‌ ‌ కింగ్స్‌పై చివరి మ్యాచ్:

పంజాబ్‌ ‌ కింగ్స్‌పై చివరి మ్యాచ్:

2018 ఐపీఎల్‌ నుంచి చెన్నై జట్టు సభ్యుడిగా కొనసాగుతున్న ఇమ్రాన్‌ తాహిర్‌.. తన చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ను గతేడాది పంజాబ్‌ కింగ్స్‌తో ఆడాడు. గడిచిన మూడు సీజన్లలో తాహిర్‌ లేకుండా చెన్నై జట్టు బరిలోకి దిగడం చాలా అరుదు. తాహిర్‌ తన ఓవరాల్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 58 మ్యాచ్‌ల్లో 16.15 స్ట్రయిక్‌ రేట్‌తో 80 వికెట్లు పడగొట్టాడు. చెన్నై ఫ్రాంఛైజీ తరఫున 26 మ్యాచ్‌లు ఆడిన తాహిర్‌‌.. 33 వికెట్లు తీశాడు. తాహిర్‌ చెన్నై తరఫున ఆడిన తొలి సీజన్‌లోనే ధోనీసేన టైటిల్‌ విజేతగా నిలిచింది.

నా అత్యుత్తమ జట్టు చెన్నై:

నా అత్యుత్తమ జట్టు చెన్నై:

'నాకు సీఎస్‌కే నుంచి అందే సహకారం మరవలేనిది. ఒక ఫ్రాంచైజీ ఇంత రెస్పెక్ట్‌ ఇవ్వడం నేను ఎక్కడా చూడలేదు. నన్ను సీఎస్‌కే చాలా గౌరవిస్తుంది. ఈ ప్రపంచంలో నా అత్యుత్తమ జట్టు చెన్నై. ఒక కుటుంబలో ఉంటే ఎలాంటి ఫీలింగ్‌ ఉంటుందో సీఎస్‌కేలో అలానే ఉంటుంది. సీఎస్‌కే ఫ్యాన్స్‌ కూడా ఆటగాళ్లపై నమ్మశక్యం కాని ప్రేమ కురిపిస్తారు. చాలా భిన్న వాతావరణాల్లో ఆడినా ఇక్కడ కల్చర్‌ను ఇష్టపడతా. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ ప్రదర్శన గురించి ఎక్కువగా మాట్లాడరు' అని తాహీర్‌ గతంలో తెలిపాడు.

Story first published: Tuesday, April 20, 2021, 20:45 [IST]
Other articles published on Apr 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X