|
క్రికెట్ చాలా ఇచ్చింది..
'చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ కోసం మొదటిసారి పాకిస్థాన్‌కు రావడం గొప్పగా ఉంది. టెస్ట్‌ల కోసం 17 ఏళ్ల తర్వాత మా జట్టు ఇక్కడికి రావడం ఉత్సాహంగా ఉంది. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ విపత్తు పాక్ ప్రజల జీవనాన్ని, దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. క్రికెట్ నా జీవితానికి కావాల్సింది ఇచ్చింది. వాటిని తిరిగివ్వడం సరైనదని నా భావన. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా నాకు లభించే మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పాకిస్థాన్ వరద బాధిత సహాయ కేంద్రానికి అందజేయాలనుకుంటున్నాను. ఈ డబ్బును వరదలతో దెబ్బతిన్న నగరాల పునర్మిణాం కోసం ఖర్చు చేస్తారని ఆశిస్తున్నా'అని స్టోక్స్ ట్వీట్ చేశాడు.

17 ఏళ్ల తర్వాత..
సుమారు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్.. పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టింది. టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు పాకిస్థాన్ వెళ్లి 7 టీ20ల సిరీస్‌ను 4-3తో గెలిచి వచ్చిన ఇంగ్లండ్.. వరల్డ్ కప్ తర్వాత మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు మళ్లీ పాక్‌కు వెళ్లింది. డిసెంబర్ 1 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుండగా.. రావల్పిండి వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అలాగే రెండో టెస్టు డిసెంబర్ 9 నుంచి ముల్తాన్‌లో, మూడో టెస్టు డిసెంబర్ 17 నుంచి కరాచీలో జరగనున్నాయి.

గతేడాది వెళ్లాల్సి ఉన్నా..
పాకిస్థాన్‌లో నెలకొన్న అనిశ్చితి, ఉగ్రదాడుల నేపథ్యంలో ఆ దేశానికి క్రికెట్ ఆడేందుకు ఏ జట్టు ముందుకు రాని విషయం తెలిసిందే. గతేడాది న్యూజిలాండ్ జట్టు వచ్చినా.. మ్యాచ్ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు పర్యటనను రద్దుచేసుకుని హుటాహుటిన స్వదేశం తిరిగి వెళ్లిపోయింది.ఆ తర్వాత.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సైతం తమ పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నాయి. కానీ.. ఆ తర్వాత.. మళ్లీ పాకిస్థాన్ వెళ్లి మ్యాచ్‌లు ఆడాయి. దీంతో ఇంగ్లండ్ మరో సారి టెస్టు సిరీస్ కోసం పాక్‌లో అడుగుపెట్టింది.

విరోచిత పోరాటం..
కాగా.. ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్లు ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్‌లో తలపడిన విషయం తెలిసిందే. అదృష్టం కొద్ది సెమీస్‌కు చేరిన ఈ రెండు జట్లు.. న్యూజిలాండ్, ఇండియాను ఓడించి ఫైనల్లోపోటీ పడ్డాయి. 2019 వన్డే వరల్డ్ కప్‌లో విరోచిత పోరాటంతో ఇంగ్లండ్‌కు వరల్డ్ కప్ అందించిన బెన్ స్టోక్స్.. పాక్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోనూ అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. ఇంగ్లండ్‌కు రెండో టీ20 వరల్డ్ కప్ అందించాడు. ఫైనల్లో పాక్‌ను ఓడించి ఆ జట్టు అభిమానుల మనసులు గాయపరిచి స్టోక్స్.. తాజాగా భారీ విరాళంతో వారి మనసులు గెలుచుకున్నాడు.