
అత్యంత విలువైన ఆటగాడిగా బెన్ స్టోక్స్
దీంతో ఐపీఎల్ పదో సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా బెన్ స్టోక్స్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన బెన్ స్టోక్స్ 316 పరుగులతో పాటు 12 వికెట్లు తీశాడు. అంతేకాదు ఐపీఎల్ పదో సీజన్‌లో మూడు సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను దక్కించుకున్నాడు.

రూ.14.5 కోట్లు పలికిన స్టోక్స్
డైలీ మిర్రర్‌కి ఇచ్చిన ఇంటర్యూలో ఐపీఎల్ ద్వారా తాను సంపాదించిన నగదుని ఏ విధంగా ఖర్చు చేశాడో క్లుప్తంగా వివరించాడు. వేలంలో అత్యధికంగా రూ.14.5 కోట్లు పలికినప్పుడు తాను ఆశ్చర్యపోయానని తెలిపాడు.

అంత ధరకు న్యాయం చేయగలనా?
అప్పట్లో ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుకున్నారని పేర్కొన్నాడు. ఒకానొక సమయంలో ఈ విషయంపై తానే జడ్జి చేసుకున్నానని, అంత ధరకు న్యాయం చేయగలనా? అని ప్రశ్నించుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన చేయగలనా అని తీవ్రంగా ఆలోచించినట్లు స్టోక్స్ తెలిపాడు.

కొంత మొత్తంతో కారు కొనుకున్నా
అయితే తనకు డ్రైవింగ్ అంటే ఇష్టపడే ఐపీఎల్‌లో అందుకున్న మొత్తంలో కొంత మొత్తంతో కారు కొనుకున్నానని, ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని దేనికీ ఉపయోగించలేదని అలాగే ఉంచినట్లు బెన్ స్టోక్స్ చెప్పాడు.