న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐర్లాండ్​తో వన్డే సిరీస్.. రూట్​, స్టోక్స్​కు విశ్రాంతి.. ఇంగ్లండ్ జట్టు ఇదే!!

Ben Stokes, Joe Root rested as ECB name 14-man squad for Ireland ODIs

మాంచెస్టర్​: ఈ నెల 30 నుంచి ఐర్లాండ్​తో జరిగే వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోమవారం జట్టును ప్రకటించింది. మొత్తం 14 మందితో కూడిన జట్టును ఈసీబీ వెల్లడించింది. వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో టెస్టులో ఉద్వాసనకు గురైన బ్యాట్స్​మన్ ​జో డెన్లీ స్థానం దక్కించుకున్నాడు. ఇయాన్ మోర్గాన్ ఇంగ్లండ్​ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. మళ్లీ జట్టులోకి వచ్చిన ఆల్ రౌండర్ మొయిన్ అలీ వైస్ కెప్టెన్​ బాధ్యతలు చేపట్టనున్నాడు.

టెస్టు కెప్టెన్ జో రూట్​, కీపర్ జోస్ బట్లర్, స్టార్ ఆల్​రౌండర్ బెన్​ స్టోక్స్​కు ఇంగ్లండ్ బోర్డు విశ్రాంతినిచ్చింది. 14 మందితో పాటు ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా ఈసీబీ ప్రకటించింది. రిచర్డ్ గ్లీసన్, లూయిస్ గ్రెగొరీ మరియు లియామ్ లివింగ్స్టోన్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్నారు. 'జట్టులో చోటు దక్కకపోవడం దురదృష్టకరమని భావించే ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు. పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. ఎంపిక చాలా కష్టంగా మారింది. అత్యున్నత జట్టునే ఎంపిక చేశాం' అని ఇంగ్లండ్ సెలెక్టర్ జేమ్స్ టేలర్ అన్నారు.

సౌతాంప్టన్​ వేదికగా ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్ల మధ్య 30వ తేదీన తొలి వన్డే జరుగనుంది. బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండానే మూడు వన్డేలు జరుగనున్నాయి. 2023 వన్డే ప్రపంచకప్ కోసం అర్హత కోసం ఐసీసీ ప్రవేశ పెట్టిన 'సూపర్​ లీగ్​' ఈ సిరీస్​తోనే ప్రారంభం కానుంది. ఈ లీగ్​లో భాగంగా ప్రతి జట్టు స్వదేశంలో నాలుగు, విదేశాల్లో మూడు వన్డే సిరీస్​లు ఆడాలి. సూపర్​ లీగ్​లో మ్యాచ్​ గెలిచిన ఒక్కో జట్టుకు 10 పాయింట్లు దక్కుతాయి. మ్యాచ్ రద్దయినా, టై అయినా ఇరు జట్ల ఖాతాలో ఐదేసి పాయింట్లు చేరుతాయి.

ఇంగ్లండ్ జట్టు:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్​), మొయిన్ అలీ, జానీ బెయిర్​ స్టో, టామ్ బాంటన్​, సామ్ బిల్లింగ్స్​, టామ్ కరన్​, లియమ్ డాసన్​, డో జెన్లీ, షకీబ్ మహమూద్​, అదిల్ రషీద్​, జేసన్ రాయ్​, రీస్ టోప్లీ, జేమ్స్ విన్స్​, డేవిడ్ విల్లీ.

ఏడింతలు ఎక్కువ.. కరెంట్‌ బిల్‌ చూసి హర్భజన్‌ షాక్.. చుట్టుపక్కల వారి బిల్లు ఇచ్చారా అంటూ సెటైర్!!ఏడింతలు ఎక్కువ.. కరెంట్‌ బిల్‌ చూసి హర్భజన్‌ షాక్.. చుట్టుపక్కల వారి బిల్లు ఇచ్చారా అంటూ సెటైర్!!

Story first published: Monday, July 27, 2020, 19:37 [IST]
Other articles published on Jul 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X