న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా వైరస్ చిచ్చు.. జాన్సన్‌-స్టోక్స్‌ల మధ్య గొడవ!!

Ben Stokes fuels war of words with Mitchell Johnson after handshake jibe
Ben Stokes Fuels War Of Words With Mitchell Johnson | Oneindia Telugu

హైదరాబాద్: చైనాలో పుట్టిన కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఇప్పటికే మూడు వేలకు పైగా మంది చనిపోయారు. ఇంకా ఎంతో మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. అయితే ఈ కరోనా వైరస్‌ మనుషులను చంపడమే కాక.. ఇద్దరు క్రికెటర్ల మధ్య చిచ్చుపెట్టింది. కరోనా కారణంగా ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం చేసుకుంటున్నారు. విషయంలోకి వెళితే...

<strong>ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌.. దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు హర్షాభోగ్లే అదిరే పంచ్!!</strong>ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌.. దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు హర్షాభోగ్లే అదిరే పంచ్!!

లంక ఆటగాళ్లతో కరచాలనం చేయం:

లంక ఆటగాళ్లతో కరచాలనం చేయం:

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో త్వరలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో తాము లంక ఆటగాళ్లతో కరచాలనం చేయమని ఇంగ్లీష్ కెప్టెన్‌ జో రూట్‌ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కరచాలనంకు బదులుగా ఫిస్ట్‌ బంప్‌ (చేతులు గుద్దుకోవడం) చేస్తామని రూట్‌ చెప్పాడు. దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా పలువురు ఇంగ్లీష్ క్రికెటర్లు, సహాయక సిబ్బంది అనారోగ్యానికి గురయిన కారణంగా ఇంగ్లండ్ క్రికెట్‌ బోర్డు తమ ఆటగాళ్లు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించింది.

స్టోక్స్‌తో కాస్త జాగ్రత్త:

స్టోక్స్‌తో కాస్త జాగ్రత్త:

జో రూట్‌ ఫిస్ట్‌ బంప్‌ఇస్తాం అని చెప్పడంతో.. బెన్‌ స్టోక్స్‌ను ఉద్దేశించి మిచెల్‌ జాన్సన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఎద్దేవా చేశాడు. 2017లో స్టోక్స్‌ ఒక క్లబ్‌ వద్ద గొడవపడిన సందర్భాన్ని గుర్తుచేస్తూ పోస్ట్ చేసాడు. 2017లో స్టోక్స్‌ బాగా మద్యం సేవించి ఇద్దరిపై దాడి చేసి అరెస్టయ్యాడు. 'ఇంగ్లండ్ మీరు ఫిస్ట్‌ బంప్‌ ఇవ్వొచ్చు. కానీ.. స్టోక్స్‌తో కాస్త జాగ్రత్తగా ఉండండి. అతడు గట్టిగా పంచ్‌లు విసురుతాడేమో' అని జాన్సన్‌ రాసుకొచ్చాడు. బాక్సింగ్‌, నవ్వుతున్న ఎమోజీలను కూడా పోస్ట్ చేసాడు.

జాన్సన్‌కు ధీటుగా స్టోక్స్‌ రిప్లై:

జాన్సన్‌కు ధీటుగా స్టోక్స్‌ రిప్లై:

విషయం తెలుసుకున్న బెన్ స్టోక్స్‌ అంతే దీటుగా జాన్సన్‌కు రిప్లై ఇచ్చాడు. 2010-11 యాషెస్‌ సందర్భంగా జాన్సన్‌ను ఉద్దేశించి బార్మీ ఆర్మీ (ఇంగ్లాండ్‌ టీమ్‌ను అభిమానించే బృందం) ఒక పాట పాడి ఇబ్బంది పెట్టింది. 'బౌల్స్‌ టు ద లెఫ్ట్‌, బౌల్స్‌ టు ద రైట్‌, ఐ వండర్‌ ఇఫ్‌ బిగ్‌ బ్యాడ్‌ మిచ్‌ లైక్స్‌ మార్‌మైట్‌' అనే పాట లిరిక్స్‌ను స్టోక్స్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మరి ఇది ఇంతటితో ఆగుతుందో లేదా జాన్సన్‌ మరేదైనా రిప్లై ఇస్తాడో చూడాలి.

ఆట‌గాళ్ల‌తో చేతులు కలపబోం:

'దక్షిణాఫ్రికా పర్యటనలో మా జట్టు అనారోగ్యానికి గురైంది. అయితే తొందరగానే కోలుకున్నాం. వైరస్‌ల కారణంగా.. వీలైనంత మేరకు ఇతరులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇకనుంచి మైదానంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉంటాం. ఆట‌గాళ్ల‌తో చేతులు కలపబోం. అందుకు బదులు ఫిస్ట్‌ బంప్స్‌ పద్ధతిని పాటిస్తాం. మేం తరచూ చేతులు కడుక్కొని శుభ్రత పాటిస్తున్నాం. మాకు ఇచ్చిన ఇమ్యూనిటీ ప్యాక్‌లలో ఉన్న యాంటీ బాక్టీరియల్ వైప్స్, జెల్స్ ఉపయోగిస్తున్నాం' అని ఇటీవల జో రూట్‌ పేర్కొన్నాడు.

Story first published: Saturday, March 7, 2020, 15:32 [IST]
Other articles published on Mar 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X