న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ మాత్రం తెలియదా?: గేలి చేసిన మాథ్యూ హేడెన్‌‌పై స్టోక్స్ సెటైర్

బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ టెస్టు సిరిస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

By Nageshwara Rao
Ben Stokes calls out Matthew Hayden after he claims to 'not know' half of England's Ashes squad

హైదరాబాద్: బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ టెస్టు సిరిస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఐదు టెస్టులు యాషెస్ సిరిస్‌కు ముందే ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు మాటల యుద్ధానికి తెరలేపారు.

బెన్‌స్టోక్స్‌కు సంబంధించి అన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యాషెస్‌ సిరిస్ కోసం ప్రకటించిన ఇంగ్లాండ్‌ జట్టులో సగం మంది ఎవరో కూడా తనకు తెలియదని ఆసీస్‌ మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్‌ గేలి చేశాడు. దీంతో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను ఆస్ట్రేలియా గెలిచేనట్టేనని పేర్కొన్నాడు.

England will miss Stokes, but Anderson and Broad are a massive threat - Siddle

'ఆ జట్టులో ఆండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ రూపంలో అనుభవజ్ఞులైన బౌలర్లు.. కుక్‌, రూట్‌ మాత్రమే మంచి బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. ఇక మిగిలిన వారంతా ఎవరు?' అని ఇంగ్లాండ్ జట్టుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అయితే హేడెన్ వ్యాఖ్యలను ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సీరియస్‌గా తీసుకున్నాడు.

'మా జట్టులో సగం మంది ఆటగాళ్లెవరో తెలియదని హేడెన్‌ చెబుతున్నాడు. నిజానికి అందులో ఇద్దరికే అంతర్జాతీయ క్రికెట్‌ అనుభవం లేదు. ఈ మాత్రం కూడా తెలియని హేడెన్‌ క్రికెట్‌ పండితుడా?' అంటూ ట్విట్టర్ వేదికగా కాస్తంత ఘాటుగానే సమాధానమిచ్చాడు.

కాగా, వెస్టిండిస్‌తో సిరిస్ జరుగుతున్న సమయంలో బార్‌లో జరిగిన గొడవ కారణంగా బెన్ స్టోక్స్‌ని యాషెస్ టెస్టు సిరిస్‌కు ఇంగ్లాండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో బెన్ స్టోక్స్ ఆడటం లేదు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 22, 2017, 15:17 [IST]
Other articles published on Nov 22, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X