న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లీష్ దినపత్రికపై న్యాయపోరాటానికి దిగిన బెన్‌ స్టోక్స్‌!!

Ben Stokes and his mother have launched legal action against The Sun

లండన్‌: ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, ప్రపంచకప్ హీరో బెన్‌​ స్టోక్స్‌ న్యాయపోరాటానికి దిగాడు. తమ కుటుంబంకు సంబంధించి బాధకరమైన, వ్యక్తిగత విషయాలను తమ ఆమోదం లేకుండా ప్రచురించిన ఆంగ్ల వార్తా దినపత్రిక 'ది సన్'పై చర్యలు తీసుకోవాలని స్టోక్స్‌ కోర్టును ఆశ్రయించాడు. బెన్‌​ స్టోక్స్‌తో పాటు అతని తల్లి కూడా స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

సెల్ఫ్‌ ట్రోల్‌ చేసుకున్న చాహల్‌.. ఎందుకో తెలుసా!!?సెల్ఫ్‌ ట్రోల్‌ చేసుకున్న చాహల్‌.. ఎందుకో తెలుసా!!?

స్టోక్స్ సీక్రెట్ ట్రాజెడీ:

స్టోక్స్ సీక్రెట్ ట్రాజెడీ:

ఆంగ్ల వార్తా దినపత్రిక అయిన 'ది సన్' మొదటగా 'స్టోక్స్ సీక్రెట్ ట్రాజెడీ' అనే పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది. బెన్ స్టోక్స్ జన్మించడానికి మూడేళ్ల ముందు అతడి కుటుంబంలో జరిగిన ఓ విషాదకర సంఘటనను ప్రచురించింది. బెన్ స్టోక్స్‌ సోదరి, సోదరుడుని అతడి తల్లి మాజీ ప్రియుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ వార్తను మూడు దశాబ్దాల తర్వాత హైలెట్‌ చేస్తూ.. ది సన్ పత్రిక ప్రచురించింది. స్టోక్స్ కుటుంబానికి సంబంధించిన ఈ సున్నితమైన అంశాన్ని ప్రచురించడంపై స్టోక్స్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. జర్నలిజం పేరుతో ఇంత దిగజారతారా? అని ప్రశ్నించారు.

భార్యతో గొడవ:

భార్యతో గొడవ:

తాజాగా మరో పత్రిక ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ (పీసీఏ) అవార్డుల కార్యక్రమం ముగిశాక.. స్టోక్స్‌ తన భార్యతో గొడవపెట్టుకున్నాడని ఓ ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా స్టోక్స్‌ భార్య క్లారే అతడి చెంపపై కొట్టినట్టు ఫొటోతో సహా ప్రచురించింది. అయితే ఆ ఫోటోలో బెన్‌ స్టోక్స్‌ను క్లారే కొట్టనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ.. ఆ మీడియా మాత్రం స్టోక్స్‌ను క్లారే కొట్టినట్లు ప్రచురించింది. ఈ విషయంపై స్టోక్స్‌ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 స్టోక్స్‌ అసహనం:

స్టోక్స్‌ అసహనం:

మీడియాలో వరుసగా తన గురించి కథనాలు రావడం పట్ల స్టోక్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్టోక్స్‌ న్యాయపోరాటానికి దిగాడు. మరోఆవైపు స్టోక్స్‌కు ఇంగ్లండ్‌ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. స్టోక్స్‌కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న పత్రికలను వారందరూ విమర్శిస్తున్నారు. న్యాయపోరాటానికి దిగిన బెన్‌ స్టోక్స్‌కు న్యాయం దక్కుతుందో చూడాలి.

 441 పరుగులు చేసిన బెన్ స్టోక్స్:

441 పరుగులు చేసిన బెన్ స్టోక్స్:

ఇటీవలే ముగిసిన ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో బెన్ స్టోక్స్ 55.12 యావరేజితో మొత్తం 441 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. దీనికి తోడు 8 వికెట్లు కూడా పడగొట్టాడు. గత ఆదివారం ఓవల్ వేదికగా ముగిసిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్ 2-2తో సమం అయింది. 47 ఏళ్ల తర్వాత యాషెస్‌ సిరీస్‌ డ్రా కావడం ఇదే తొలిసారి. సిరీస్‌ డ్రా అయినప్పటికీ, ట్రోఫీ మాత్రం ఆస్ట్రేలియా దగ్గరే ఉంటుంది. గత యాషెస్ సిరిస్‌లో ఆసీస్‌ గెలిచినందున ట్రోఫీని వారి వద్దే ఉండనుంది.

Story first published: Friday, October 11, 2019, 15:24 [IST]
Other articles published on Oct 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X