న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీబీఎల్: క్యాచ్ మిస్ చేశాడు... ముఖం పగలగొట్టుకున్నాడు (వీడియో)

Ben Cutting Drops A Catch Into His Own Face In Heat’s Impact Against The Renegades
 Ben Cutting drops a catch into his own face in Heat’s clash against the Renegades

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్‌ క్యాచ్ పట్టబోయి ముఖాన్ని రక్తసిక్తం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టిన బెన్‌ కట్టింగ్ ఓ సునాయాస క్యాచ్ పట్టలేకపోయిన సంఘటన బిగ్ బాష్ లీగ్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న బీబీఎల్ 8వ సీజన్‌లో బెన్ కట్టింగ్ బ్రిస్బేన్ హీట్ జట్టు తరుపున ఆడుతున్నాడు.

<strong>భారత్‌తో వన్డే సిరిస్‌కు 1980నాటి జెర్సీలతో ఆస్ట్రేలియా (వీడియో)</strong>భారత్‌తో వన్డే సిరిస్‌కు 1980నాటి జెర్సీలతో ఆస్ట్రేలియా (వీడియో)

మ్యాచ్‌లో గాయపడ్డ బెన్ కట్టింగ్

మ్యాచ్‌లో గాయపడ్డ బెన్ కట్టింగ్

టోర్నీలో భాగంగా గురువారం బ్రిస్బేన్ హీట్-మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. మెల్‌బోర్న్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌‌లో ప్యాటిన్‌సన్ వేసిన నాలుగో బంతిని రెనెగేడ్స్ బ్యాట్స్‌మన్ మార్కస్ హారిస్ అమాంతం గాల్లోకి లేపాడు. గాల్లో ఉన్న బంతిని అంచనా వేయడంలో బెన్ కట్టింగ్ విఫలమయ్యాడు.

బంతి నేరుగా ముఖానికే తగిలింది

బంతి నేరుగా ముఖానికే తగిలింది

దీంతో ఆ బంతి నేరుగా అతడి ముఖాన్ని తాకింది. నుదురు, ముక్కు మీద బలంగా తాకడంతో ముఖం వెంట రక్తం కారింది. అయితే, వెంటనే ప్రధమ చికిత్స చేయించుకుని తిరిగి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు సైతం

ఫైనల్లో హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డుని సైతం అందుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, టెస్టు క్రికెట్‌లో మాత్రం అరంగేట్రం చేయలేదు.

Story first published: Thursday, January 10, 2019, 18:38 [IST]
Other articles published on Jan 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X