క్రికెటర్ షమీకి షాక్ మీద షాక్: అటు భార్య, ఇటు బీసీసీఐ

Posted By:
BCCI withholds central contract for Mohammed Shami

హైదరాబాద్: భార్య హసిన్‌ జహాన్‌ చేసిన తీవ్ర ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి బీసీసీఐ సైతం భారీ షాకిచ్చింది. 2017 అక్టోబర్ నుంచి సెప్టెంబరు 2018 వరకు ఆటగాళ్ల ఏడాది కాంట్రాక్టులను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌(సీఓఏ) బుధవారం ప్రకటించింది.

టార్చర్, చంపేందుకు యత్నం: క్రికెటర్ షమీ అక్రమ సంబంధాలపై భార్య సంచలన వ్యాఖ్యలు

Mohammed Shami’s illicit affairs

బీసీసీఐ ప్రకటించిన ఈ వార్షిక కాంట్రాక్టులో షమీకి చోటు దక్కలేదు. టీమిండియాలో కీలక సభ్యుడైన షమికి ఏ విభాగంలోనూ చోటు లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గాయాలబారిన పడుతున్నా నిలకడ ప్రదర్శనతో జట్టులో చోటు దక్కించుకునేవాడు. అయితే పునరుద్ధరించిన తాజా కాంట్రాక్టు నుంచి షమీని తప్పించింది.

షమీకి చాలామంది యువతులు, మహిళలతో వివాహాతేర సంబంధాలున్నాయని అతడి భార్య హసిన్‌ జహాన్‌ బుధవారం మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. షమీ ఓ శృంగార పురుషుడని వ్యాఖ్యానించిన జహాన్‌.. విడాకులు ఇవ్వాలంటూ తనను షమీ కుటుంబం తనను వేధిస్తోందని ఆమె ఆరోపించారు.

నా భర్తను కోర్టుకు లాగుతా

నా భర్తను కోర్టుకు లాగుతా

కానీ వైవాహిక బంధాన్ని తెంచుకునే ప్రసక్తే లేదని, భర్తను కోర్టుకు లాగుతానని ఆమె జాతీయ మీడియాకు తెలిపారు. అంతేకాదు తన భర్త సంబంధాలు కొనసాగిస్తున్న కొందరు యువుతులు, మహిళల వివరాలు, ఫోన్‌ నెంబర్లను ఆమె సోషల్‌ మీడియాలో సైతం పోస్టు చేయడం కలకలం రేపింది. అయితే షమీ దీనిపై వివరణ కూడా ఇచ్చాడు.

 నా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు

నా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు

కెరీర్‌ పరంగా తనను దెబ్బతీసేందుకు కొందరు ఈ కుట్ర పన్నారని.. భార్య తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని క్రికెటర్‌ షమీ చెప్పడం విశేషం. తాజా పరిణామాల నేపథ్యంలోనే చివరి నిమిషంలో అతని పేరును జాబితా నుంచి తప్పించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. తాజా వివాదంపై విచారణ పూర్తయ్యే వరకు షమీకి కాంట్రాక్ట్‌ దక్కదు.

 షమీపై వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న బోర్డు

షమీపై వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న బోర్డు

'షమీ వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలను, వార్తలను బోర్డు పరిగణనలోకి తీసుకుంది. దీంతో షమీ కాంట్రాక్ట్‌ను నిలిపే విషయంలో మేమే సందిగ్ధ స్థితిలో నిలిచాం. క్రికెటర్ల కాంట్రాక్టులు రూపొందించిన రోజే షమీ భార్య అతడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. షమీ భార్య ఆరోపణలకు, షమీ కాంట్రాక్ట్‌ నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదు' అని బీసీసీఐ అధికారి తెలిపాడు

 అందుకే షమీ పేరు కాంట్రాక్టులో లేదు

అందుకే షమీ పేరు కాంట్రాక్టులో లేదు

'షమిపై ఆరోపణలు చేసిన మహిళ.. పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. అధికారిక నివేదిక వచ్చే వరకు అతడి విషయంలో వేచిచూడడమే తెలివైన పని. మా నిర్ణయం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉండొచ్చునని కూడా చర్చించుకున్నాం. అందుకే అతడి పేరును కాంట్రాక్ట్‌ జాబితాలో ప్రకటించలేదు' అని ఆయన తెలిపారు.

సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ మాట్లాడుతూ

సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ మాట్లాడుతూ

మరోవైపు సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ మాట్లాడుతూ 'షమీ కాంట్రాక్ట్‌ను నిలిపే విషయంలో మేమే సందిగ్ధ స్థితిలో నిలిచాం. అవి వ్యక్తిగత ఆరోపణలైతే కాంట్రాక్ట్‌ ప్రొఫెషనల్‌కు సంబంధించినది కదా అనే సందేహం వచ్చింది. అయితే ఆరోపణలు ఇంత తీవ్రంగా ఉన్నా మీరు అతడికి గుర్తింపు ఇస్తున్నారు కదా అని ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంది' అని అన్నారు. షమీ టీమిండియా తరఫున 30 టెస్టుల్లో, 50 వన్డేల్లో, 7 టీ20ల్లో ఆడాడు.

Story first published: Thursday, March 8, 2018, 10:43 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి