న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 : ఐపీఎల్‌లో నయా రూల్.. గేమ్ ఛేంజర్ అంటున్న బీసీసీఐ

BCCI to introduce Impact Player rule to IPL from 2023 season

ఐపీఎల్ మ్యాచుల్లో కావలసినంత డ్రామా ఉంటుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ ఉంటుంది. ప్రతి మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. ఈ థ్రిల్‌ను మరింత పెంచేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తూనే ఉంటుంది.

ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి మరో సరికొత్త రూల్‌ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

కొత్త రూల్..

కొత్త రూల్..

ఐపీఎల్ 2023 నుంచి ప్రతి మ్యాచ్‌లో 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనను అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం ప్రతి మ్యాచ్‌లో ఒక సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ పాత్ర పరిధి మరింత పెరుగుతుంది. అంటే అతను జట్టు విజయాల్లో మరింత కీలక పాత్ర పోషిస్తాడన్నమాట. ఇటీవలే ఈ నిబంధనను ప్రయోగాత్మకంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా బీసీసీఐ అమలు చేసింది. అక్కడ సక్సెస్ సాధించడంతో ఈ రూల్‌ను ఐపీఎల్‌లో కూడా అమలు చేయాలని డిసైడ్ అయింది.

బీసీసీఐ ఏమందంటే?

బీసీసీఐ ఏమందంటే?

ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నింటికీ తమ నిర్ణయం గురించి బీసీసీఐ వివరాలు తెలియజేసింది. ''ఐపీఎల్ 2023 సీజన్ నుంచి వ్యూహాత్మకమైన కాన్సెప్ట్‌ను అమలు చేయనున్నాం. ఇది ఐపీఎల్‌కు మరో కొత్త కోణాన్ని జత చేస్తుంది. ఈ నిబంధన ప్రకారం, ఒక్కో జట్టు నుంచి ఒక సబ్‌స్టిట్యూట్ ఆటగాడి పరిధి మరింత పెరుగుతుంది. అతను జట్టులో సాధారణ సబ్‌స్టిట్యూట్ కంటే ఎక్కువ యాక్టివ్ రోల్ పోషిస్తాడు. దీనికి సంబంధించిన నియమనిబంధనలను త్వరలోనే పూర్తిగా వెల్లడిస్తాం'' అని బీసీసీఐ తెలిపింది.

ఇంపాక్ట్ ప్లేయర్ అంటే?

ఇంపాక్ట్ ప్లేయర్ అంటే?

వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వచ్చే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన గురించి మనకు ప్రస్తుతానికి పెద్దగా చెప్పలేం. కానీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చూసిన దాని ప్రకారం.. ప్రతి జట్టు టాస్ సమయంలోనే ఆడే 11 మందితోపాటు మరో నలుగురు ఇంపాక్ట్ ప్లేయర్లు లేదా సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల వివరాలను అంపైర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్‌లో ఆ నలుగురు మాత్రమే సబ్‌స్టిట్యూట్లుగా ఆడగలరు. వీళ్లు ఆడే 11 మందిలో ఎవరి స్థానంలో అయినా బరిలో దిగి బ్యాటింగ్ చేయొచ్చు. అలాగే పూర్తి కోటా ఓవర్లు కూడా వేయొచ్చు. అయితే వీళ్లను ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లోపే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఏదైనా కారణం వలల్ల మ్యాచ్‌ను 10 ఓవర్ల కన్నా తక్కువకు కుదించేస్తే మాత్రం ఈ నిబంధన వర్తించదు.

గేమ్ ఛేంజర్..

గేమ్ ఛేంజర్..

ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన గేమ్ ఛేంజర్‌లా మారుతుందని బీసీసీఐ భావిస్తోంది. పుట్‌బాల్ వంటి క్రీడల్లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లపై పెద్దగా నిబంధనలేవీ ఉండవు. వాళ్లు కూడా రెగ్యులర్ ఆటగాళ్లలాగే ఆడతారు. కానీ క్రికెట్‌లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల పరిధి చాలా తక్కువగా ఉంటుంది. కేవలం ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే వారికి వీలుంటుంది. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో ఈ సమస్య కూడా తీరుతుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున హృతిక్ షోకీన్ తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా రంగంలోకి దిగాడు. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ఈ నిబంధన అమలైంది.

Story first published: Friday, December 2, 2022, 14:50 [IST]
Other articles published on Dec 2, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X