న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ చెంచాలకే జట్టులో చోటు.. పాపం పృథ్వీ షా.. సెలెక్షన్‌ కమిటీపై నెటిజన్ల ఫైర్!

 BCCI selection committee brutally trolled after Prithvi shaw was not picked WTC final
WTC Finals : Prithvi Shaw ను పక్కనపెట్టడంపై ఆగ్రహం... Kohli కెప్టెన్ అయ్యేవాడా ? | Oneindia Telugu

హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం చేతన్‌ శర్మ నేతృత్వంలోని నేషనల్ సెలెక్షన్‌ కమిటీ 20 మందితో కూడిన భారత జట్టును శుక్రవారం ప్రకటించింది. జూన్‌ 18-22 మధ్య సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో కోహ్లీ సేన డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ జరుగుతుంది. కాగా, సెలెక్టర్లు జట్టు ఎంపికలో సంచలనాలకు చోటివ్వలేదు.

ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన భారత జట్టునే ఈసారీ పరిగణనలోకి తీసుకున్నారు. కానీ సీనియర్ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు చైనామన్‌ బౌలర్ కుల్దీప్‌ యాదవ్‌, యువ ఓపెనర్ పృథ్వీ షా‌లపై వేటు పడింది. అయితే పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాల్సిందని అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.

ఒక్క మ్యాచ్ వైఫల్యంతో..

ఒక్క అడిలైడ్ టెస్ట్ వైఫల్యంతో పృథ్వీ షాను పక్కన పెట్టడం సరికాదని మాజీ క్రికెటర్లు ఆశిష్ నెహ్రా, ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. అడిలైడ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన షా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 4 పరుగులకు అదే రీతీలో ఔటయ్యాడు. బంతి ఇన్‌స్వింగ్‌ అయి లోపలికి దూసుకు వస్తున్నప్పుడు అతడి బ్యాటు, ప్యాడ్ల మధ్య ఎక్కువ దూరం ఉంటోంది. దీనివల్ల బంతి ఆ మధ్యలోంచి వెళ్లి వికెట్లను గిరాటేసేది.

దాంతో షా బ్యాటింగ్ టెక్నిక్‌పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. టీమ్‌మేనేజ్‌మెంట్ కూడా పృథ్వీ షాను పక్కనపెట్టింది. అనంతరం భారత్‌కు వచ్చిన షా తన బ్యాటింగ్ లోపాన్ని సరిచేసుకున్నాడు. విజయ్ హజారే, ఐపీఎల్ 2021లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. అయినా సెలెక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకోలేదు.

కోహ్లీ చెంచాలకే చోటు..

ఇక పృథ్వీ షాను పక్కనపెట్టడంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమ్ ఎంపిక నిష్పక్షపాతంగా జరగలేదని, కోహ్లీతో సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లనే ఎంపిక చేశారని ఆరోపిస్తున్నారు. భారత జట్టులో కోహ్లీ చెంచాలకే అవకాశం దక్కుతుందని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు.

పృథ్వీ షా మంచి ఫామ్‌లో ఉన్నా.. అతన్ని కాదని, ఫిట్‌నెస్ లేని, ఆసుపాత్రిపాలైన కేఎల్ రాహుల్ అవకాశం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు అతనికి అవకాశాలిస్తారని మండిపడుతున్నారు. దిగులు చెందవద్దని, తనకూ మంచి రోజులు వస్తాయని పృథ్వీ షాకు దైర్యం చెబుతున్నారు.

సెలెక్టర్ల బిగ్ మిస్టేక్..

విజయ్ హజారే ట్రోఫీలో 800కు పైగా పరుగులు చేసినా.. ఐపీఎల్‌లో 3 హాఫ్ సెంచరీలతో 300 ప్లస్ రన్స్ చేసినా.. పృథ్వీ షాకు జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఓ అభిమాని కామెంట్ చేశాడు. టీమిండియా సెలెక్టర్లు చేసిన పెద్ద తప్పిదమని అభిప్రాయపడ్డాడు. ఆసీస్, ఇంగ్లండ్‌తో ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడకున్నా.. బెడ్‌పై ఉన్నా కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇచ్చారని, ఇది చాలా అన్యాయమని, పృథ్వీ షాకు టైమ్ వస్తుందని మరొకరు కామెంట్ చేశారు.

పృథ్వీ షాకు మంచి రోజులు వస్తాయని మరో అభిమాని ట్వీట్ చేశాడు. ఒక్క మ్యాచ్ విఫలమయ్యాడని పక్కన పెట్టడం భావ్యం కాదని, ఆ రోజుల్లో ధోనీ కూడా కోహ్లీని పక్కనపెట్టుంటే.. ఈ రోజు టీమిండియాకు కెప్టెన్ అయ్యేవాడా? అని మరొక అభిమాని కామెంట్ చేశాడు.

చెలరేగిన షా..

ఆసీస్ పర్యటన అనంతరం తన టెక్నిక్‌ను సవరించుకున్న షా.. విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో 800కు పైగా పరుగులు చేశాడు. తాజా ఐపీఎల్ సీజన్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచుల్లో 38.50 సగటు, 166 స్ట్రైక్‌రేట్‌తో 308 పరుగులు చేశాడు. 3 హాఫ్ సెంచరీలు బాదాడు. సీనియర్‌ ఆటగాడు శిఖర్ ధావన్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ ఓవర్‌లోనే 6 బంతులకు 6 ఫోర్లు కొట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు

Story first published: Saturday, May 8, 2021, 15:51 [IST]
Other articles published on May 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X