మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని: ఆటగాళ్ల సెక్యూరిటీపై అసోసియేషన్లకు వార్నింగ్!

BCCI orders hosting associations to beef up security for players

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తుండగా.. ఓ అభిమాని స్టేడియంలోకి దూసుకొచ్చిన సంగతి తెలసిందే. అనంతరం కోహ్లీతో కరచాలనం చేయాలని ప్రయత్నించగా.. ఆందోళనకు గురై వెనక్కు తగ్గాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డులు వచ్చి అభిమానిని బయటికి తీసుకెళ్లిపోయారు.

ఇలాంటి ఘటనలపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్‌ అజిత్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మొహాలి వేదికగా జరిగిన రెండో టీ20లో అభిమానులు రెండు సార్లు మైదానంలోకి వచ్చి ఆటకు ఆటంకం కలిగించారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు హోటల్‌ నుంచి బయల్దేరి తిరిగి మళ్లీ హోటల్‌కు చేరుకునే వరకు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న ఆసోసియేషన్లే భద్రత కల్పించాలని స్పష్టం చేశాడు.

'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్‌కు వినూత్నంగా బర్త్‌డే విషెస్ చెప్పిన కేఎల్ రాహుల్!

అజిత్‌ సింగ్‌ లేఖ

అజిత్‌ సింగ్‌ లేఖ

ఈ మేరకు క్రికెట్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అసోసియేషన్లకు శనివారం అజిత్‌ సింగ్‌ లేఖ రాశాడు. అందులో భవిష్యత్తులో ఆటగాళ్లకు సెక్యూరిటీ లోపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లు లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారిందని... అది ప్రమాదకరమైన పరిస్థితికి కూడా దారితీస్తుందని తెలిపారు.

భద్రతా ఏర్పాట్లు లేని కారణంగా

భద్రతా ఏర్పాట్లు లేని కారణంగా

భద్రతా ఏర్పాట్లు లేని కారణంగా అభిమానులు తమ అభిమాన ఆటగాళ్ళపై తమ ప్రేమను చూపించడానికి కొన్నిసార్లు అతి చేయడాన్ని కూడా మనం చూశామని ఆ లేఖలో పేర్కొన్నారు. "ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 రద్దవడంతో టీమిండియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రెండో మ్యాచ్‌ కోసం మొహాలికి ముందుగానే చేరుకున్నారు" అని అన్నాడు.

చండీగఢ్‌ పోలీసులు అలా!

చండీగఢ్‌ పోలీసులు అలా!

"స్థానిక అసోసియేషన్‌తో ఉన్న సమస్యల కారణంగా క్రికెటర్లకు చండీగఢ్‌ పోలీసులు సెక్యూరిటీ కల్పించలేదు. తొలి రోజు హోటల్‌ యాజమాన్యమే ఆటగాళ్లకు ప్రైవేట్‌ సెక్యూరిటీని కల్పించింది. రెండో రోజుకు చంఢీగడ్ పోలీసులు ఆటగాళ్లకు భదత్ర కల్పించలేదు. ఇది చాలా విచారకరం. క్రికెటర్లకు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత అసోసియేషన్లదే" అని అందులో ఆయన పేర్కొన్నారు.

మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని

మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని

"రెండో టీ20లో మైదానంలోకి అభిమానులు దూసుకొచ్చారు. లాంగాఫ్‌, లాంగాన్‌, మిడాన్‌, మిడాఫ్‌, డీప్‌ థర్డ్‌మన్‌ వంటి ఫీల్డింగ్‌ పొజిషన్ల నుంచి బయటివాళ్లు మైదానంలోకి దూసుకొస్తున్నారు. దీంతో ఆయా స్థానాల వద్ద ప్రత్యేక దృష్టి కేంద్రీ కరించాలి. మరోసారి మొహాలి ఘటనలు జరగకుండా జాగ్రత్తగా వహించాలి" అని అసోసియేషన్లకు ఘాటుగా రాశారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Saturday, September 21, 2019, 19:03 [IST]
Other articles published on Sep 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X