న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంజయ్‌ మంజ్రేకర్‌కు బీసీసీఐ షాక్.. కామెంట్రీ ప్యానెల్‌ నుంచి ఔట్?!!

BCCI removes Sanjay Manjrekar from its commentary team

ముంబై: ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత, భారత మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాక్ ఇచినట్టు సమాచారం తెలుస్తోంది. బీసీసీఐ కామెంట్రీ ప్యానెల్‌ నుంచి మంజ్రేకర్‌ను తొలగించారని సమాచారం. బీసీసీఐ వేటు కారణంగా గత కొంత కాలంగా భారత స్వదేశీ మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మంజ్రేకర్‌.. ఈసారి జరుగనున్న ఐపీఎల్‌-13లోనూ కనిపించకపోవచ్చు. మంజ్రేకర్‌ని తొలగించడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

<strong>కరోనా భయం.. 24 గంటల పర్యవేక్షణలో కివీస్ స్టార్ బౌలర్!!</strong>కరోనా భయం.. 24 గంటల పర్యవేక్షణలో కివీస్ స్టార్ బౌలర్!!

మంజ్రేకర్‌పై బీసీసీఐ వేటు:

మంజ్రేకర్‌పై బీసీసీఐ వేటు:

ధర్మశాల వేదికగా గురువారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌కు సంజయ్‌ మంజ్రేకర్‌ మినహా మిగతా వ్యాఖ్యాతలు సునీల్‌ గావస్కర్‌, ఎల్‌ శివరామకృష్ణన్‌, మురళీ కార్తీక్‌ మాత్రమే హాజరయ్యారని 'ముంబై మిర్రర్' పేర్కొంది. ఆ మ్యాచ్‌లో మంజ్రేకర్‌ ఎక్కడా కనిపించకపోవడంతో.. బీసీసీఐ అతనిపై వేటు వేసిన కారణంగానే తొలి వన్డేలో కనిపించలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 పనితీరు నచ్చకే:

పనితీరు నచ్చకే:

సంజయ్ మంజ్రేకర్‌ని తొలగించడానికి గల అసలు కారణాలు తెలియరాలేదు. కానీ.. బీసీసీఐ అధికారులకు అతని పనితీరు నచ్చలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. 'ఐపీఎల్‌ ప్యానెల్‌ నుంచి కూడా మంజ్రేకర్‌ను తొలగించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది మా ఆలోచనల్లో మాత్రం లేదు. అసలు నిజం ఏంటంటే.. మంజ్రేకర్‌ పనితీరు పట్ల బీసీసీఐ అధికారులు సంతోషంగా లేరు' అని ఓ ఉన్నతాధికారి చెప్పినట్లు ఆ ప్రతిక రాసుకొచ్చింది.

జడేజా కౌంటర్:

జడేజా కౌంటర్:

సంజయ్ మంజ్రేకర్‌ వ్యాఖ్యానం బాగానే ఉన్నా.. అతడి దురుసు ప్రవర్తన మాత్రం ఎవరికీ నచ్చదు. వ్యాఖ్యానం సమయంలో, ట్వీట్ల ద్వారా అందరిని హేళన పరుస్తుంటాడు. ఈ క్రమంలోనే గతేడాది రెండుసార్లు సోషల్ మీడియాలో భారత అభిమానుల ఆగ్రహానికి గురైయ్యాడు. ప్రపంచకప్‌ 2019 సందర్భంగా రవీంద్ర జడేజాని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. తర్వాత తోటి వ్యాఖ్యాత హర్షాభోగ్లే సామర్థ్యాలను ప్రశ్నించాడు. ఈ రెండు సంఘటనలకు సంబంధించి క్షమాపణలు చెప్పినా.. సోషల్‌ మీడియాలో నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జడేజా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

భారత్ తరఫున 111 అంతర్జాతీయ మ్యాచ్‌లు:

భారత్ తరఫున 111 అంతర్జాతీయ మ్యాచ్‌లు:

కరోనా కారణంగా ఇప్పటికే ఐపీఎల్ 2020, వన్డే సిరీస్ రద్దైన విషయం తెలిసిందే. ఈ రెండు రద్దవడంతో భారత అభిమానులలో ఆందోళన నెలకొంది. అయితే తాజాగా మంజ్రేకర్‌పై వేటు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 54 ఏళ్ల ఈ క్రికెటర్ భారతదేశం తరఫున 111 అంతర్జాతీయ మ్యాచ్‌లు (37 వన్డేలు, 74 టెస్టులు) ఆడాడు. 1996లో క్రికెట్ ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం వ్యాఖ్యానం మొదలుపెట్టాడు.

Story first published: Saturday, March 14, 2020, 13:14 [IST]
Other articles published on Mar 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X