ఫోటోలు: పుజారాకు ‘అర్జున’, సర్దార్‌‌కు ఖేల్‌రత్న

Posted By:

హైదరాబాద్: ఈ ఏడాది స్వదేశంలో జరిగిన టెస్టు సిరిస్‌లలో పరుగుల వరద పారించిన ఛటేశ్వర్ పుజారా పేరును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు సిఫారసు చేసింది. పుజారా ఈ టెస్టు సీజన్‌లో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే.

డబుల్ సెంచరీతో టీమిండియా విజయాల్లో కీలకంగా నిలిచాడు. పుజారాతోపాటు భారత మహిళా జట్టు క్రికెటర్‌ హర్మన్‌ప్రీత కౌర్‌ పేరునూ ప్రతిపాదించింది. అయితే రాజీవ్‌ఖేల్‌ రత్న అవార్డుకు మాత్రం ఎవరి పేరునూ బీసీసీఐ సిఫారసు చేయలేదు. ఈ సీజన్‌లో పుజారా 1316 పరుగులు సాధించాడు.

ఒక టెస్టు సీజన్‌లో అత్యధిక స్కోరు

ఒక టెస్టు సీజన్‌లో అత్యధిక స్కోరు

ఒక టెస్టు సీజన్‌లో ఓ ఆటగాడికి ఇవే అత్యధిక స్కోరు కావడం విశేషం. 48 టెస్టుల్లో 51పైగా సగటుతో 3,798 పరుగులు చేసిన ఈ పుజారా 11 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు చేశాడు. ఇక హర్మన్‌ప్రీత్‌కౌర్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతగా రాణిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌‌లో భారత్ విజయం సాధించడంలో కీలకపాత్రో పోషించింది.

ఆసియా కప్‌ గెలవడంలో కీలకపాత్ర

ఆసియా కప్‌ గెలవడంలో కీలకపాత్ర

దీంతో పాటు మహిళల ఆసియా కప్‌ గెలవడంలోనూ కీలకపాత్ర పోషించింది. ‘పూజారా, హర్మన్‌ప్రీత పేర్లను అర్జున అవార్డులకోసం క్రీడా మంత్రిత్వ శాఖకు ఏకగ్రీవంగా సిఫారసు చేశాం. గత సీజన్‌లో అద్భుతంగా రాణించిన వీరి పేర్లను ఆమోదానికి పంపాం' అని బీసీసీఐ సీనియర్‌ ఆఫీస్‌ బేరర్‌ ఒకరు వెల్లడించారు.

ఖేల్‌ రత్న అవార్డుకు సర్దార్‌ సింగ్‌

ఖేల్‌ రత్న అవార్డుకు సర్దార్‌ సింగ్‌

ఇక క్రీడల్లో ప్రతిష్ఠాత్మక రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డుకు భారత హాకీ మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌ పేరును హాకీ ఇండియా (హెచ్‌ఐ) సిఫారసు చేసింది. 2003-04లో భారత జూనియర్‌ టీమ్‌లో స్థానం సంపాదించిన సర్దార్‌.. అనతి కాలంలోనే సీనియర్‌ జట్టుకు ఎంపికయ్యాడు. పిన్న వయసులోనే హాకీ ఇండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ద్రోణాచార్య అవార్డుకు సందీప్‌ సంగ్వాన్‌

ద్రోణాచార్య అవార్డుకు సందీప్‌ సంగ్వాన్‌

2008లో జరిగిన అజ్లాన్‌ షా హాకీ టోర్నీలో జట్టుకు తొలిసారి కెప్టెన్‌గా వ్వవహరించాడు. 2012లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. కాగా, ఎస్‌వీ సునీల్‌, ధరమ్‌వీర్‌ సింగ్‌, దీపికలను అర్జున అవార్డుకు సిఫారసు చేశారు. ఆర్‌పీ సింగ్‌, సుమ్‌రాయ్‌ టిటీను ధ్యాన్‌చంద్‌ అవార్డుకు హెచ్‌ఐ సిఫారసు చేసింది. కోచ్‌లు సందీప్‌ సంగ్వాన్‌, రోమెస్‌ పఠానియా పేర్లు ద్రోణాచార్య అవార్డుకు ప్రతిపాదించింది.

Story first published: Tuesday, May 2, 2017, 11:24 [IST]
Other articles published on May 2, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి