న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సౌరవ్ గంగూలీ క్షేమం.. గురువారం రెండో స్టెంట్‌!!

BCCI President Sourav Ganguly absolutely stable, doctors to take call on placing 2nd stent soon

కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం తెలిసింది. దాదా ఆరోగ్యంపై దిగులుపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసీజీ) రిపోర్టులో స్వల్ప మార్పులు కనిపించాయని, బుధవారం రాత్రి వైద్యులంతా కలిసి రెండో యాంజియోప్లాస్టీపై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. గురువారం రెండో స్టెంటు అమర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఇంతకుముందు గుండెనొప్పితో బాధపడిన సౌరవ్ గంగూలీ హృదయ రక్తనాళాల్లో మూడు పూడికలను గుర్తించారు. ఒకదాంట్లో స్టెంట్‌ను అమర్చారు. అనంతరం ఆరోగ్యంగానే ఉండటంతో.. రెండో స్టెంట్‌ వేయడాన్ని వాయిదా వేశారు. అయితే బుధవారం ఉదయం దాదా అసౌకర్యంగా ఉన్నారని, ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. సీసీయూ 142 యూనిట్‌లో ఆయనను ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదని వైద్యులు తెలిపారు.

ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం సౌరవ్ గంగూలీ ఈసీజీ నివేదికలో స్వల్ప మార్పులు గుర్తించారని తెలిసింది. వైద్యులు దాదా ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దాదా ఆరోగ్యం విషమంగా ఏమీ లేదని ఆందోళన అక్కర్లేదని వారు తెలిపారు. యాంజియోప్లాస్టీపై నిర్ణయం తీసుకొనేముందు మరోసారి దాదాను పరీక్షించనున్నారు. దాదాపుగా గురువారం రెండో స్టెంట్‌ అమర్చుతారని అంటున్నారు.

మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 7212 రన్స్, వన్డేల్లో 11363 పరుగులు చేశారు. మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లోనూ 59 మ్యాచ్‌లాడిన దాదా.. 106.81 స్ట్రైక్‌రేట్‌తో 1349 పరుగులు చేశారు. బౌలర్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 132 వికెట్లు, ఐపీఎల్‌ 10 వికెట్లని దాదా పడగొట్టారు. మీడియం పేస్ బౌలింగ్‌ దాదా ఆకట్టుకున్నారు.

టాప్‌లోనే కోహ్లీ, రోహిత్‌.. మూడులో బుమ్రా! ఆ జాబితాలో జడేజా ఒక్కడే!టాప్‌లోనే కోహ్లీ, రోహిత్‌.. మూడులో బుమ్రా! ఆ జాబితాలో జడేజా ఒక్కడే!

Story first published: Wednesday, January 27, 2021, 19:03 [IST]
Other articles published on Jan 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X