న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మనోళ్లు అప్పుడే ప్రాక్టీసు మొదలెట్టారుగా.. బీసీసీఐ ఫోటోలు పోస్ట్ చేసింది

BCCI Posted some interesting pics of Indian Test squad practice session Ahead of 5th test with England

జులై 1 నుంచి 5 వరకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరగనున్న అయిదోది, రీషెడ్యూల్ చేసింది అయిన చివరి టెస్ట్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత టెస్ట్ జట్టు ప్రస్తుతం లీసెస్టర్‌లో ఉంది. భారత్ ఈ టెస్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇక ఈ టెస్ట్ కోసం 17మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో ప్రసిద్ధ సిరీస్ విజయం అందుకోవడానికి భారత్ కేవలం డ్రా చేసినా చాలు. ఇక న్యూజిలాండ్‌తో ఇటీవల సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ టీం విజయోత్సాహంతో ఇండియాతో బరిలోకి దిగే అవకాశముంది. ఇక ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ 2 స్థానంలో ఉండగా.. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు 6వ స్థానంలో ఉంది.

ప్రస్తుతం.. రోహిత్ శర్మ నేతృత్వంలోని ఇండియా జట్టు లీసెస్టర్‌లో శిక్షణ తీసుకుంటుంది. మరో వారం పాటు ఇండియా టీం ఇక్కడే శిక్షణ పొందుతుంది. ఇక సోమవారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో ఉండగా క్లిక్ మనిపించిన కొన్ని చిత్రాలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇకపోతే ఇండియా జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇంగ్లాండ్‌లో టెస్ట్ క్రికెట్ ఆడటం తనకు చాలా ఇష్టమని, టెస్ట్ జట్టుకు కోచింగ్‌ చేయడాన్ని తాను మరింత ఇష్టపడతానని పేర్కొన్నాడు. ఇక ఇంతకుముందు ఈ సిరీస్ కొనసాగుతుండగా టీమిండియా శిబిరంలో కోవిడ్-19 కేసులు వెలుగుచూడడంతో చివరి టెస్ట్ రద్దయింది. అప్పుడు భారత జట్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్సీ వహించాడు. ఇక ఈ సిరీస్లో టీమిండియా 2-1తేడాతో ఆధిక్యంలో ఉంది.

'ప్రస్తుతం ఇంగ్లాండ్ చాలా బాగా ఆడుతోంది. గత సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం ఇంగ్లాండ్ మళ్లీ కమ్ బ్యాక్ అయి చాలా స్ట్రాంగ్‌గా కన్పిస్తుంది. ఇటీవల వారు కొన్ని మంచి గేమ్‌లు ఆడారు. అలాగే మా సైడ్ కూడా మంచి ప్లేయర్లు ఉన్నారు.' అని రాహుల్ ద్రావిడ్ తెలిపాడు. ఇక తాను 'టెస్ట్ క్రికెట్ ఆడటాన్ని ఇష్టపడ్డాను, టెస్ట్ క్రికెట్ చూడడాన్ని ఇష్టపడ్డాను, ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌ జట్టుకు కోచింగ్‌ చేయడాన్ని ఇష్టపడుతున్నాను. అందుకే ఈ టెస్ట్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాను' అంటూ తనదైన శైలిలో ద్రావిడ్ ముగించాడు.

భారత టెస్ట్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్) శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛెతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ (గమనిక: కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదు. అతని స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సి ఉంది.)

Story first published: Monday, June 20, 2022, 20:03 [IST]
Other articles published on Jun 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X