న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ పాలిటిక్స్: శ్రీని రాకతో వాయిదాపడ్డ సమావేశం

By Nageswara Rao

కోల్‌కత్తా: కోల్‌కత్తాలో శుక్రవారం జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం వాయిదా పడింది. బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ తమిళనాడు క్రికెట్ సంఘం చీఫ్ హోదాలో హాజరయ్యారు.

శ్రీనివాసన్ రాకతో బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు శ్రీనివాసన్‌కు ఏం అర్హత ఉందంటూ కొందరు సభ్యులు ప్రశ్నించారు. దీంతో బీసీసీఐ సమావేశాలకు తాను హాజరు కావొచ్చని జస్టిస్ శ్రీకృష్ణ పేర్కొన్నారని శ్రీని వాదించారు.

BCCI meeting adjourned due to Srinivasan's presence

ఈ సమావేశం సందర్భంగా పలువురు సభ్యులు, బీసీసీఐ సమావేశాలకు దూరంగా ఉండాలంటూ శ్రీనికి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసన్ హోదా విషయంలో న్యాయపరమైన స్పష్టత వచ్చేవరకు ఆయనను అనుమతించలేమని బీసీసీఐ లీగల్ అడ్వైజర్ ఉషానాథ్ బెనర్జీ అభిప్రాయపడ్డారు.

శుక్రవారం జరగాల్సిన ఈ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ప్రకటించారు. ఈ సమావేశంలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్, చెన్నై జట్ల నిషేధంపై కమిటీ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X