న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నార్త్ టు సౌత్: మారనున్న బీసీసీఐ కార్యాలయం

BCCI likely to shift headquarters to Bengaluru once NCA takes shape

హైదరాబాద్: కొన్ని సంవత్సరాలుగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని బెంగళూరుకు తరలించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. దీని కోసం ఏర్పట్లను భారీస్థాయిలో మొదలుపెట్టింది. బెంగళూరులో జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) నిర్మాణం కోసం బీసీసీఐ 40 ఎకరాల స్థలం కొనుగోలు చేసింది.

ప్రస్తుతం ఎన్‌సీఏ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకో రెండేళ్లలో అవి పూర్తికాగానే ప్రధాన కార్యాలయాన్ని కూడా అక్కడికే మార్చాలని బీసీసీఐ యోచనలో ఉంది. స్థల మార్పు ఎందుకంటే బోర్డు సమావేశం జరిగినప్పుడల్లా ఐదు నక్షత్రాల హోటల్లో ఖర్చు తడిసి మోపెడవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయంపై బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా బోర్డు సభ్యుల సలహాలు కోరుతూ లేఖ రాశాడు. ''ప్రస్తుత ప్రధాన కార్యాలయం తగినంత సౌకర్యంగా లేదని అందరూ భావిస్తున్నారు. దీన్ని విస్తరించే అవకాశం కూడా లేదు. బెంగళూరు విమానాశ్రయానికి దగ్గర్లో ఎన్‌సీఏ కోసం బీసీసీఐ 40 ఎకరాలు తీసుకుంది." అని పేర్కొన్నాడు.

దాంట్లో ఎన్‌సీఏతో పాటు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవనచ్చనేది ఆయన సూచనగా అభిప్రాయపడ్డాడు. ఆ స్థలంలో కొద్ది భాగాన్ని ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగించాలని తెలియజేశాడు. అక్కడే బోర్డు సమావేశాలు పెట్టుకునేలా ఏర్పాట్లు చేసుకుంటే ఖర్చు తగ్గే సూచనలున్నాయంటూ సీకే ఖన్నా లేఖలో వివరించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 6, 2018, 8:44 [IST]
Other articles published on Feb 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X