న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షమీ నిజంగానే దుబాయ్‌లో రెండు రోజులు గడిపాడట

BCCI Letter Confirms Shami Was in Dubai for Two Days in February

హైదరాబాద్: షమీ దుబాయ్‌లో రెండు రోజులు గడిపిన మాట వాస్తవమేనని బీసీసీఐ పేర్కొంది. హసీన్ జహాన్ నుంచి వరుస ఆరోపణలు ఎదుర్కొంటున్న షమీపై ఆమె చేసిన ఆరోపణ ఒకటి రుజువైంది. ఆరోపణలతో పాటుగా అతనిపై విచారణ జరపాలంటూ బీసీసీఐకి లేఖ రాసింది షమీ భార్య. ఆమె విజ్ఞప్తి మేరకు విచారణ చేపట్టిన బీసీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి భారత్‌కి వస్తూ.. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ రెండు రోజులు దుబాయ్‌లో ఉన్నమాట వాస్తవమేనని బీసీసీఐ నిర్ధారించింది.

పాకిస్థాన్‌కి చెందిన మహిళతో షమీ రెండు రోజులు దుబాయ్‌లోని ఓ హోటల్‌లో గడిపాడని, ఆమె నుంచి పెద్ద మొత్తంలో డబ్బు కూడా తీసుకున్నాడని హసీన్ ఆరోపించింది. మహ్మద్ షమీ భార్య హసీన్ జాహన్ 'బీసీసీఐ నుంచి లెటర్‌ని మేము అందుకున్నాం. అందులో.. మహ్మద్ షమీ గత ఫిబ్రవరి 17, 18న దుబాయ్‌లోనే ఉన్నట్లు స్పష్టంగా ఉంది. ఇక ఈ కేసుకి సంబంధించిన మిగతా అంశాలపై విచారణ కొనసాగిస్తాం' అని జాయింట్ సీపీ (నేర విభాగం) ప్రవీణ్ త్రిపాఠి మీడియాతో వెల్లడించారు.

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ అనంతరం వన్డే, టీ20 జట్టులో తాను లేకపోవడంతో సుదీర్ఘ పర్యటన మధ్యలోనే మహ్మద్ షమీ భారత్‌కి వచ్చేశాడు. అయితే.. ఈ ప్రయాణం మధ్యలోనే అతను దుబాయ్‌కి వెళ్లినట్లు సమాచారం. అయితే ఆ ఖర్చులు ఎవరు భరించారనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే..:
దుబాయ్‌లో షమీతో గడిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మహిళ అలిష్బా కూడా సోమవారం స్పందించిన విషయం తెలిసిందే. 'మహ్మద్ షమీని నేను దుబాయ్‌లో కలిసిన మాట వాస్తవమే. అక్కడ నా సోదరి ఉంటుండటంతో.. నేను తరచూ దుబాయ్ వెళ్తుంటా. గత ఏడాది ఓ అభిమానిగా షమీతో పరిచయం ఏర్పడింది. అనంతరం చాట్ ద్వారా స్నేహితురాలినయ్యా. అలా పరిచయంలో భాగంగానే.. దుబాయ్‌లో అతను ఉన్నాడని తెలుసుకుని వెళ్లి.. కలిసి టిఫిన్ తిన్నాం. మా మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు' అని అలిష్బా స్పష్టం చేసింది.

Story first published: Tuesday, March 20, 2018, 14:10 [IST]
Other articles published on Mar 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X