హవ్వ!!: కోహ్లీని కౌంటీకి పంపుతారా? సీవోఏ తీరుపై బీసీసీఐ ఫైర్?

Posted By:
BCCI-CoA feud stoked over naming of anti-corruption chief, official’s extension

ముంబై: పాలకుల కమిటీ (సీవోఏ), ఆఫీస్‌ బేరర్ల మధ్య అభిప్రాయబేధాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో కొంతకాలంగా బీసీసీఐ వేడెక్కుతోంది. సుమారు 22 రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలతో బోర్డు మాజీ బాస్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ న్యూఢిల్లీలోని ఓ హోటల్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే.

సీవోఏ నిర్ణయాలపై సుప్రీంకోర్టులోనే సవాల్‌ చేసేందుకు శ్రీని అధ్యక్షతన సమావేశం తీర్మానించినట్టు అనధికార సమాచారం. బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి బహిరంగంగానే సీవోఏ వైఖరిపై తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాడు.

వినోద్ రాయ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు

వినోద్ రాయ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు

పాలకుల కమిటీ, ఆఫీస్‌ బేరర్లతో సంప్రదించి తీసుకున్న నిర్ణయాల్లో విరాట్‌ కోహ్లిని కౌంటీ క్రికెట్‌లోకి అనుమతించటమేనని బీసీసీఐ బోర్డు వర్గాలు అంటున్నాయి. మిగతా వాటిలో మెజార్టీ నిర్ణయాలను పాలకుల కమిటీ చైర్మన్‌ వినోద్‌ రాయ్ ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారని ఆఫీస్‌ బేరర్ల నుంచి వస్తున్న తీవ్ర ఆరోపణ. ఇందుకు బలం చేకూర్చుతున్నట్టుగా ఇటీవల బీసీసీఐ నియామకం ఒకటి చోటుచేసుకున్నది.

 ఏకపక్షంగా పాలక కమిటీ నిర్ణయం తీసుకున్నదని ఆరోపణలు

ఏకపక్షంగా పాలక కమిటీ నిర్ణయం తీసుకున్నదని ఆరోపణలు

రాజస్థాన్‌ మాజీ డీజీపీ అజిత్‌ సింగ్‌ను బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్‌గా నియమిస్తూ పాలకుల కమిటీ ప్రకటన చేసింది. దీనిపై ఆఫీస్‌ బేరర్లను సంప్రదించలేదని తెలుస్తోంది. కానీ పాలకుల కమిటీ, లోధా సిఫారసుల ప్రకారం బోర్డు ఉద్యోగులు 60 ఏళ్ల వయసొచ్చాక ఉద్యోగ విరమణ చేయాలి. ఆఫీస్‌ బేరర్లకు ఇది 70 ఏళ్లు. కానీ ప్రస్తుతం ఏసీయూ చీఫ్‌గా ఎంపికైన అజిత్‌ సింగ్‌ వయసు 61. ఆయనకు ముందు ఏసీయూ చీఫ్ గా పని చేసిన నీరజ్ కుమార్ ను ఐపీఎల్ నేపథ్యంలో వచ్చేనెలాఖరు వరకు కొనసాగించాలని బీసీసీఐ పాలక మండలి నిర్ణయించింది.

అమితాబ్ కొనసాగింపునకు లభించని అనుమతి

అమితాబ్ కొనసాగింపునకు లభించని అనుమతి

ఇదే సమయంలో భారత క్రికెట్‌కు మూడు దశాబ్దాలుగా సేవలందిస్తోన్న ప్రొ. రత్నాకర్‌ శెట్టికి మరో మూడు నెలలు పొడగింపు లభించ లేదు. అమితాబ్‌ చౌదరి కొనసాగింపు కోసం లేఖ రాసినా వయసు నిబంధన సాకుతో పాలకుల కమిటీ పక్కనపెట్టింది. ఇదే సమయంలో అజిత్‌ సింగ్‌ను 61 ఏళ్ల వయసులో నియమించింది. పాలకుల కమిటీ నిబంధనలు వ్యక్తులను బట్టి మారుతు న్నాయని ఈ ఉదంతంతోనే తెలుస్తోందని ఆఫీస్‌ బేరర్లు విమర్శిస్తున్నారు.

1985 నుంచి ముంబై.. 1996 నుంచి బీసీసీఐలో రత్నాకర్ సేవలు

1985 నుంచి ముంబై.. 1996 నుంచి బీసీసీఐలో రత్నాకర్ సేవలు

ఇక రత్నాకర్‌ శెట్టి ముంబై క్రికెట్‌లో 1985 నుంచి పని చేస్తున్నారు. 1996 నుంచి బీసీసీఐలోనే కొనసాగుతున్నారు. మార్చి 31తో రత్నాకర్‌ శెట్టి పదవీ విరమణ రోజు. ఈ విషయం బీసీసీఐలోని ఎవ్వరికీ తెలియకపోగా, సుదీర్ఘ కెరీర్‌లో కనీస వీడ్కోలు లేకుండా రత్నాకర్‌ శెట్టి ఆఫీస్‌ వదిలి వెళ్లటంపై బోర్డు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 2, 2018, 10:46 [IST]
Other articles published on Apr 2, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి