న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విజయవాడలో జరగనున్న సిరీస్‌లలో తొలి రెండ్రోజుల మ్యాచ్ రద్దు..

BCCI calls off first two matches of Quadrangular Series due to bad weather

ముంబై: క్వాడ్రాంగ్యులర్ సిరీస్‌లో భాగంగా విజయవాడలో జరగాల్సిన తొలి రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. మూలపాడులోని రెండు స్టేడియాలలో ఆగష్టు 17 శుక్రవారం నుంచి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. సిరీస్‌లో భాగంగా ఆగష్టు 17న ఇండియా ఏ, ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య ఒక మ్యాచ్.. ఇండియా బి, దక్షిణాఫ్రికా ఏ జట్ల మధ్య మరో మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ పిచ్‌లు అనుకూలంగా లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఆస్ట్రేలియా జట్టుతో పాటు గ్రెగ్‌ చాపెల్‌ కూడా

ఆస్ట్రేలియా జట్టుతో పాటు గ్రెగ్‌ చాపెల్‌ కూడా

ఈ సిరీస్‌లో పాల్గొనేందుకు ఇండియా ఎ, బి జట్ల సభ్యులతో పాటు దక్షిణాఫ్రికా ఎ, ఆస్ట్రేలియా ఎ జట్లు కూడా మంగళవారమే విజయవాడకి చేరుకున్నాయి. ఆస్ట్రేలియా జట్టుతో పాటు గ్రెగ్‌ చాపెల్‌ కూడా విచ్చేశారు. నగరానికి చేరుకున్న క్రికెటర్లకు ఆంధ్రా క్రికెట్‌ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌. అరుణ్‌కుమార్‌, ట్రెజరర్‌ రామచంద్రరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ త్రినాథరాజు, మీడియా మేనేజర్‌ సీఆర్‌ మోహన్‌ తదితరులు స్వాగతం పలికారు. కాగా, ఈ మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విజయవంతంగా

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విజయవంతంగా

సుదీర్ఘ విరామం తర్వాత విజయవాడలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇండియా ఎ, న్యూజిలాండ్ ఎ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. ఆ సిరీస్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విజయవంతంగా నిర్వహించడంతో.. ఈ సిరీస్‌ను కూడా మూలపాడులో నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గుచూపింది. ఈ సిరీస్‌లో భాగంగా మొత్తం 14 మ్యాచ్‌లు జరగనున్నాయి.

రెండు రోజుల్లో పిచ్‌ సిద్ధం చేస్తామని..:

రెండు రోజుల్లో పిచ్‌ సిద్ధం చేస్తామని..:

వర్షంతో పూర్తిగా తడిసి ముద్దైన పిచ్‌లపై ఆట సాధ్యం కాదని క్యూరేటర్ ఎస్. శ్రీరామ్ స్పష్టం చేయడంతో ఈ రెండు మ్యాచ్‌లను రద్దు చేస్తూ బీసీసీఐ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్ డే (ఆగస్టు 18న) కూడా ఆట సాధ్యం కాదని క్యూరేటర్ స్పష్టం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఈ రెండు రోజుల్లో పిచ్‌ను సిద్ధం చేస్తామని, వాతావరణం అనుకూలిస్తే మిగిలిన మ్యాచ్‌లన్నీ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని తెలిపారు.

సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లషెడ్యూల్

సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లషెడ్యూల్

ఆగస్టు 19: ఇండియా ఎ vs ఇండియా బి, వేదిక: డీవీఆర్

ఆగస్టు 19: ఆస్ట్రేలియా ఎ vs దక్షిణాఫ్రికా ఎ, వేదిక: డాక్టర్ గోకరాజు లైలా గంగరాజు ఏసీఏ

ఆగస్టు 21: ఇండియా ఎ vs దక్షిణాఫ్రికా ఎ, వేదిక: డీవీఆర్

ఆగస్టు 21: ఇండియా బి vs ఆస్ట్రేలియా ఎ, వేదిక: డాక్టర్ గోకరాజు లైలా గంగరాజు ఏసీఏ

ఆగస్టు 23: ఇండియా బి vs దక్షిణాఫ్రికా ఎ, వేదిక: డీవీఆర్

ఆగస్టు 23: ఇండియా ఎ vs ఆస్ట్రేలియా ఎ, వేదిక: డాక్టర్ గోకరాజు లైలా గంగరాజు ఏసీఏ

ఆగస్టు 25: ఆస్ట్రేలియా ఎ vs దక్షిణాఫ్రికా ఎ, వేదిక: డీవీఆర్

ఆగస్టు 25: ఇండియా ఎ vs ఇండియా బి, వేదిక: డాక్టర్ గోకరాజు లైలా గంగరాజు ఏసీఏ

ఆగస్టు 27: ఇండియా బి vs ఆస్ట్రేలియా ఎ, వేదిక: డీవీఆర్

ఆగస్టు 27: ఇండియా ఎ vs దక్షిణాఫ్రికా ఎ, వేదిక: డాక్టర్ గోకరాజు లైలా గంగరాజు ఏసీఏ

ఆగస్టు 29: ఫైనల్, వేదిక: డీవీఆర్

జట్లు:

ఇండియా ఎ:

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, రవికుమార్ సమర్థ్, సూర్యకుమార్ యాదవ్, హనుమ విహారీ, నితీష్ రానా, సిద్ధేష్ లాడ్, సంజు సామ్సన్, మయాంక్ మార్కాండే, క్రిష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్, శివం మావి, కె. ఖలీల్ అహ్మద్

ఇండియా బి:

మనీష్ పాండే (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్నమ్ గిల్, దీపక్ హుడా, రికీ భుయ్, ఇషాన్ కిషన్, శ్రేయాష్ గోపాల్, జయంత్ యాదవ్, ధర్మేంద్రసిన్హ్ జడేజా, సిద్ధార్థ్ కౌల్, ప్రసిధ్ క్రిష్ణ, కుల్వంత్ ఖేజ్రోలియా, నవదీప్ సైనీ

ఆస్ట్రేలియా ఎ:

ట్రావిస్ హెడ్ (కెప్టెన్), అలెక్స్ కారే, ఆష్టన్ అగర్, పీటల్ హ్యాండ్స్‌కాబ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చేగ్నే, మైఖేల్ నెసెర్, మట్ రెన్షా, జ్యే రిచర్డ్‌సన్, డి. ఆర్కీ షార్ట్, బిల్లీ స్టేన్‌లేక్, మిచెల్ స్వెప్సన్, క్రిస్ ట్రెమెయిన్, జాక్ విల్డర్‌ముత్

దక్షిణాఫ్రికా ఎ:

ఖయా జోండో (కెప్టెన్), తెంబా బవుమా, ఫర్హాన్ బెహర్డియన్, గిహాన్ క్లోటే, తెనిస్ డి బ్ర్యూన్, రాబర్ట్ ఫ్రైలింక్, బ్యూరన్ హెండ్రిక్స్, సిసాండా మగాలా, పీటర్ మలన్, సెనురన్ ముతుసామీ, డేన్ పీటర్సన్, రుడి సెకండ్, డ్వెయిన్ ప్రెటోరియస్, టబ్రియాజ్ షమ్సీ, మాలుసి సిబోటో

Story first published: Friday, August 17, 2018, 16:42 [IST]
Other articles published on Aug 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X