న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 : మినీ వేలానికి మళ్లీ అతడే.. గతేడాది కళ్లు తిరిగి పడిపోయినా..!

BCCI asks Hugh Edmeades to return as auctioneer for IPL Mini Auction

క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వేలం పాటు కూడా అందరిలో ఆసక్తి రేపుతుంది. ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటాపోటీగా ఖర్చు చేయడం కూడా అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్‌గా నిలుస్తుంది. ఇలాంటి వేలాన్ని నిర్వహించాలంటే మామూలు వాళ్ల వల్ల కాదు. మంచి నిఖార్సయిన ఆక్షనీర్ అయితేనే ఆ ఎద్దడిని తట్టుకోగలుగుతాడు. అందుకే ఐపీఎల్ యాజమాన్యం ఈ బాధ్యతలను రిచర్డ్ మ్యాడ్లీకి అప్పగించింది.

మ్యాడ్లీ తర్వాత..

మ్యాడ్లీ తర్వాత..

ఆ తర్వాత పదేళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వర్తించిన మ్యాడ్లీ.. 2018లో తన బాధ్యతల నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నాడు. అతని నుంచి ఆ బాధ్యతను హ్యూ ఎడ్మీడ్స్ అందుకున్నాడు. అంతకుముందు ప్రముఖ ఆక్షన్ కంపెనీ చార్లీస్‌లో పని చేసిన ఎడ్మీడ్స్... ఐపీఎల్ వేలాన్ని కూడా సమర్ధవంతంగా నిర్వహించాడు. తన కెరీర్‌లో 2500పైగా వేలంపాటను నిర్వహించినా కూడా ఐపీఎల్ వేలం తనకు చాలా ఎగ్జయింటింగ్‌గా ఉందని గతంలో చెప్పాడు.

వేలం మధ్యలో కళ్లుతిరిగి పడిపోతే..

వేలం మధ్యలో కళ్లుతిరిగి పడిపోతే..

అయితే గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైన కాసేపటికే ఎడ్మీడ్స్ కళ్లు తిరిగి పడిపోయాడు. ఇది చూసిన అందరూ కంగారు పడిపోయారు. పోస్చరల్ హైపోటెన్షన్ వల్లనే అతను అలా పడిపోయినట్లు ఆ తర్వాత తెలిసింది. దీంతో వేలాన్ని కాసేపు నిలిపివేసిన బీసీసీఐ అధికారులు.. ఆ తర్వాత చారు శర్మను వేలంపాట నిర్వహించాల్సిందిగా కోరారు. చివర్లో వేలం చివరి ఫేజ్‌లో ఉండగా మళ్లీ ఆక్షనీర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించిన అతను.. లంచ్ మిస్ అవడం తను చేసిన తప్పు అని చెప్పాడు. ఆ తర్వాత వేలం సాఫీగానే సాగిపోయింది.

థ్రిల్ అవుతున్నా..

థ్రిల్ అవుతున్నా..

ఇలాంటి అనుభవం తర్వాత మళ్లీ ఎడ్మీడ్స్‌ను బీసీసీఐ సంప్రదిస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ బీసీసీఐ మాత్రం మరోసారి ఎడ్మీడ్స్‌నే పిలిచి, డిసెంబరు 23న జరిగే మినీ వేలం నిర్వహించాలని కోరింది. ఇదే విషయాన్ని వెల్లడించిన ఎడ్మీడ్స్.. మినీ వేలం కోసం తను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. డిసెంబర్ 21న తాను కోచి చేరుకుంటానని, తొలిసారి కోచికి వెళ్లడం కూడా తనకు ఎగ్జయింటింగ్‌గా ఉందని అన్నాడు. 'ఐపీఎల్ 2023 వేలం నిర్వహించాలని బీసీసీఐ అడగడంతో చాలా థ్రిల్ అయ్యా. మొట్టమొదటిసారి కోచికి వెళ్తున్నందుకు కూడా ఎగ్జయిట్ అవుతున్నా' అని చెప్పాడు.

Story first published: Wednesday, November 30, 2022, 15:35 [IST]
Other articles published on Nov 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X