అజారుద్దీన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసుకోవచ్చు: బీసీసీఐ

Posted By: Subhan
BCCI allows Mohammad Azharuddin to contest Hyderabad Cricket Association polls

హైదరాబాద్: (హెచ్ సీ ఏ) వివాదాల ఎపిసోడ్ ఇంకా సమసిపోలేదు. శేష నారాయణను సస్పెుండ్ చేయాలి అని మొదలైన నాటి నుంచి ఆరోపణలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివాదం అజహరుద్దీన్ వైపుకు మళ్లింది.

ఈ వివాదాలను పరిష్కారం చేసే దిశగా బీసీసీఐ కొత్త ప్రతిపాదన తీసికొచ్చింది. అదేంటంటే భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయమని సూచించింది. అయితే ఇంతకుముందు అజారుద్దీన్ పై ఉన్న జీవిత కాల నిషేదాన్ని ఈ సందర్భంగా ఎత్తి వేసినట్లు ప్రకటించింది.

మార్చి 2013లో ఆంద్రప్రదేశ్ హైకోర్టు విధించిన నిషేదానికి బీసీసీఐ మళ్లీ రివ్యూ పిటీషన్ పంపింది. ఇది పరిశీలించిన అనంతరం అజారుద్దీన్ ను హెచ్ సీ ఏ ఎన్నికలకు పోటీ చేయొచ్చు అని సూచించింది.

అజారుద్దీన్ నిషేదానికి సంబంధించిన ముఖ్య తేదీలు:
2000, డిసెంబరు 5: బీసీసీఐకి గాని, ఐసీసీ గాని సంబంధించన ఎటువంటి కాంట్రాక్టులలోనూ, జట్టు ప్రతినిధిగా గానూ పాల్గొనకూడదు.

2003: బీసీసీఐ ఆర్డర్ ను ధిక్రిస్తూ అజారుద్దీన్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశాడు.

2012: బీసీసీఐ పెట్టిన కండిషన్లు సరికావంటూ చెప్పిన సివిల్ కోర్టు నిర్ణయాన్ని ఆంద్రప్రదేశ్ హైకోర్టు ఆమోదించింది.

2013: బీసీసీఐ హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించింది కానీ, సమర్ధించలేకపోయింది.

వివేక్ ఎన్నిక సరైంది కాదు:
కాగా, హైదరాబాద్ క్రికెట్ సంఘం లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేయడం లేదని అజారుద్దీన్ మండిపడ్డారు. హెచ్‌సీఏ అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ క్రికెట్ సంఘంతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. హైదరాబాద్ క్రికెట్ సంఘ పాలకవర్గ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

తెలంగాణలో క్రికెట్‌ను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని... అందుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. తెలంగాణ క్రికెట్‌ బాగుపడుతుందంటే తాను ఎన్ని గంటలైనా గేటు బయటే ఉంటానని అన్నారు. హైదరాబాద్ నుంచే క్రికెట్ ఆడి... భారత జట్టుకు ఎంపికయ్యాయని వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేయడం తప్పా అని ప్రశ్నించారు. వివేక్ వ్యవహార శైలి సరిగా లేదని... ఆయన ఎన్నిక అప్రజాస్వామికంగా జరిగిందన్నారు.

Story first published: Saturday, January 13, 2018, 13:44 [IST]
Other articles published on Jan 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి