న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బిగ్‌బాష్‌లో హైడ్రామా.. హిట్‌ వికెట్‌ సంబరాలు.. కానీ నాటౌట్‌ (వీడియో)

BBL Team Celebrates Steve Smiths Hit Wicket Dismissal, But He Remains Not Out

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచుతోంది. ఇప్పటికే బౌలర్, ఫీల్డర్, బ్యాట్స్‌మన్‌ల విన్యాసాలతో లీగ్‌ ఆసక్తిగా సాగుతోంది. మరోవైపు బీబీఎల్ నిర్వాహకులు కూడా బిగ్‌బాష్ లీగ్‌ను మరింత ఆసక్తిగా మార్చుతున్నారు. మైదానంలో జరిగిన ఘటనలను బీబీఎల్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంది. తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో అభిమానులను ఆకట్టుకుంది.

టీ20ల్లో మనీష్‌ పాండే జైత్రయాత్ర.. వరుసగా ఆరుసార్లు నాటౌట్‌!!టీ20ల్లో మనీష్‌ పాండే జైత్రయాత్ర.. వరుసగా ఆరుసార్లు నాటౌట్‌!!

హిట్‌ వికెట్‌ సంబరాలు:

హిట్‌ వికెట్‌ సంబరాలు:

లీగ్‌లో భాగంగా శుక్రవారం మెల్‌బోర్న్‌ స్టార్స్‌-సిడ్నీ సిక్సర్స్‌ జట్ల మధ్య క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరిగింది. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ బౌలర్ హరిస్‌ రాఫ్‌ వేసిన 8వ ఓవర్ ఐదో బంతిని సిక్సర్స్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్ ఎదుర్కొన్నాడు. బంతి బౌన్స్‌ కాగా.. స్మిత్‌ తప్పించుకునేందుకు యత్నించాడు. అయితే స్మిత్‌ అదుపు తప్పి వికెట్లపైకి వెళ్లడంతో బెయిల్స్‌ కిందిపడిపోయాయి. దాంతో స్మిత్ హిట్‌ వికెట్‌ అయ్యాడని మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.ఇది చూసిన స్మిత్ మాత్రం ఆశ్చర్యంగా ఉండిపోయాడు.

ఆనందం ఆవిరైంది:

ఆనందం ఆవిరైంది:

ఔట్ విషయంలో ఫీల్డ్‌ అంపైర్లు.. థర్డ్‌ అంపైర్‌ను సంప్రదించగా అది నాటౌట్‌గా తేలింది. స్మిత్‌ వికెట్లను తాకడానికి కంటే ముందే.. బెయిల్స్‌ పైకి లేవడంతో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. స్మిత్ తాకే సమయంలో గాలి కారణంగా బెయిల్స్‌ కిందపడిపోయాయి. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంతో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఆటగాళ్ల ఆనందం ఒక్కసారిగా ఆవిరపోయింది. అయితే ఈ అవకాశాన్ని స్మిత్‌ ఉపయోగించులేకపోయాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 24 పరుగులు చేసి.. ఆడమ్‌ జంపా వేసిన 13వ ఓవర్‌లో పెవిలియన్ చేరాడు.

ఫైనల్‌కు సిక్సర్స్‌:

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. జోష్ ఫిలిప్స్ 34 పరుగులు చేసాడు. ఆడమ్‌ జంపా మూడు వికెట్లు తీసాడు. అనంతరం లక్ష్య ఛేదనలో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 99 పరుగులకే ఆలౌట్‌ కావడంతో పరాజయం పాలైంది. క్లింట్ హిన్చ్లిఫ్ (25) టాప్ స్కోరర్. సీన్ అబోట్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.ఈ విజయంతో సిడ్నీ సిక్సర్స్‌ ఫైనల్‌కు చేరగా.. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ రెండో క్వాలిఫయర్‌ (చాలెంజర్‌ మ్యాచ్‌) ఆడటానికి సిద్ధమైంది.

Story first published: Saturday, February 1, 2020, 15:01 [IST]
Other articles published on Feb 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X