న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రషీద్ ఖాన్ వీరవిహారం.. 18 బంతుల్లో 40 పరుగులు (వీడియో)

BBL 2019: Rashid Khan Smashed 40 Runs In 18 Balls

అడిలైడ్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌ (బీబీఎల్‌)లో బ్యాట్స్‌మన్‌ చెలరేగి ఆడుతున్నారు. లీగ్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించగా.. ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ ఓ స్టన్నింగ్‌ క్యాచ్‌తో హాట్‌టాపిక్‌ అయ్యాడు. ఆస్ట్రేలియా హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ లిన్‌ తన ప్రతాపం చూపించాడు. తాజాగా అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు.

'గోల్డ్ మెడల్ నా 15 ఏళ్ల కల.. దేశం గర్వించే విధంగా ఆడుతా''గోల్డ్ మెడల్ నా 15 ఏళ్ల కల.. దేశం గర్వించే విధంగా ఆడుతా'

లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ థండర్స్‌ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకి రషీద్ ఖాన్ ఆడుతున్నాడు. మొదటగా బ్యాటింగ్ చేసిన థండర్స్‌ 168 పరుగులు చేసి.. స్ట్రైకర్స్ ముందు 169 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో స్ట్రైకర్స్ జట్టు విజయానికి చివరి 21 బంతుల్లో 46 పరుగులు అవసరం. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.

రషీద్ వీరవిహారం చేస్తూ కేవలం 18 బంతుల్లోనే 40 ( 4x4, 3x6) పరుగులు చేశాడు. ఫాస్ట్ బౌలర్లు గ్రీన్, మోరీస్ బౌలింగ్‌లో స్వీప్, హుక్ షాట్స్‌తో అలరించాడు. రషీద్ ఊపు చూస్తే.. మ్యాచ్‌ని సునాయాసంగా గెలిపించేలా కనిపించాడు. కానీ.. స్ట్రైకర్స్ విజయానికి చివరి 2 బంతుల్లో 5 పరుగులు చేయాల్సిన దశలో రషీద్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. రెండో పరుగు కోసం ప్రయత్నిస్తూ పెవిలియన్ చేరాడు.

చివరి బంతికి అగర్ (0) కూడా రనౌటవడంతో స్ట్రైకర్స్ ఓడిపోయింది. కేవలం 3 పరుగుల తేడాతో స్ట్రైకర్స్ ఓటమిపాలవ్వడంతో రషీద్ నిరాశ చెందాడు. అయితే రషీద్ విధ్వంసక ఇన్నింగ్స్ మాత్రం అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సంచలన ఇన్నింగ్స్‌కు సంబందించిన వీడియోను స్ట్రైకర్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

Story first published: Wednesday, January 1, 2020, 17:18 [IST]
Other articles published on Jan 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X