న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌలింగ్ మాయాజాలం.. బ్యాట్స్‌మన్‌కి తెలీలేదు(వీడియో)

Batsman In Disbelief After Being Bowled By Stunning Leg-Break In Vitality Blast

హైదరాబాద్: భారత్‌లో జరిగే దేశీవాలీ లీగ్ ఐపీఎల్.. జరుగుతున్నంత కాలం లీగ్‌లో ఆడని భారత క్రికెటర్లంతా విరామంలో ఉన్నారు. ఎందుకంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వేరే ఏ టోర్నమెంట్‌ను షెడ్యూల్‌లో పెట్టుకోలేదు. కానీ, ఇంగ్లాండ్‌లో అలా కాదు. ఓవైపు భారత్‌, ఇంగ్లండ్‌ జాతీయ జట్ల మధ్య టెస్ట్‌ సిరీస్‌ జరుగుతున్నా మరోవైపు ఇంగ్లాండ్‌ దేశవాలీ ట్వంటీ20 లీగ్‌ క్రికెట్‌ ప్రేమికులకు వినోదాన్ని పంచుతోంది.

అయితే ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో లంకషైర్‌ లైట్‌నింగ్‌ టీమ్‌పై 7 వికెట్ల తేడాతో బర్మింగ్‌హామ్‌ బియర్స్‌ గెలుపొందింది. తద్వారా క్వార్టర్స్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. బర్మింగ్‌హామ్‌ బియర్స్‌ బౌలర్‌ జోస్‌ పోయెస్‌డెన్‌ వేసిన ఓ బంతి టోర్నమెంట్‌లో సూపర్‌ బాల్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ బౌలింగ్‌ చేసిన పోయెస్‌డెన్‌ ఆ ఓవర్‌ చివరి బంతికి తన లెగ్‌ స్పిన్‌ మాయాజాలం ప్రదర్శించాడు. గింగిరాలు తిరుగుతూ వికెట్ల వైపు దూసుకెళ్లిన బంతిని లంకషైర్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవెన్‌ క్రాఫ్ట్‌ అంచనా వేయలేకపోవడంతో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. బంతి ఎలా వికెట్లవైపుగా వెళ్లిందో అర్థంకాక క్రాఫ్ట్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో లంకషైర్‌ 10 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.

102 పరుగులకు లంకషైర్‌ ఆలౌట్‌ కాగా, ఛేదనలో బర్మింగ్‌హామ్‌ ఆటగాళ్లు ఇయాన్‌ బెల్(34)‌, ఎడ్‌ పొలాక్‌(36)లు 68 పరుగుల కీలక భాగస్వామ్యంతో 7 వికెట్ల తేడాతో సులువుగా విజయం సాధించింది. విజేత బర్మింగ్‌హామ్​ టీమ్‌ క్వార్టర్స్‌ ఆశలు సజీవంగా నిలుపుకోగా, ఈ మ్యాచ్‌లో ఓడిన లంకషైర్‌ ఇదివరకే క్వార్టర్స్‌ చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా మహిళల దేశీవాలీ లీగ్‌ జరుగుతోంది. ఈ లీగ్‌కు భారత్ నుంచి టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్... బ్యాటింగ్ సంచలనం స్మృతి మంధాన ఆడుతున్నారు.

Story first published: Thursday, August 16, 2018, 14:55 [IST]
Other articles published on Aug 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X