న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాండ్యా, రాహుల్ సస్పెన్షన్ ఎత్తివేతపై రెండుగా చీలిన క్రికెట్ ఫ్యాన్స్

Bans On Hardik Pandya, KL Rahul Lifted For Now; Fans Divided Over Decision

హైదరాబాద్: 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన ఈ ఇద్దరిపై ఉన్న సస్పెన్షన్‌‌ని ఎత్తివేస్తున్నట్లు బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా న్యూజిలాండ్‌ పర్యటనకు బయల్దేరాడు.

ఊరట: హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌‌లపై నిషేధం ఎత్తివేతఊరట: హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌‌లపై నిషేధం ఎత్తివేత

ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఇప్పటికే నేపియర్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.

ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం మౌంట్ మాంగనుయ్‌లో జరగనుంది. ఈ క్రమంలో పాండ్యా భారత జట్టుతో కలవనున్నాడు. మరోవైపు ప్రస్తుతం ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న కేఎల్‌ రాహుల్‌ భారత్‌-ఏ తరఫున ఆడనున్నాడు. ఇంగ్లాండ్‌ లయన్స్‌తో భారత్-ఏ జట్టు ఐదు వన్డేలు ఆడనుంది.

సస్పెన్సన్‌‌ను ఎత్తివేయడంపై

సస్పెన్సన్‌‌ను ఎత్తివేయడంపై

అయితే, వీరిద్దపై ఉన్న సస్పెన్సన్‌‌ను ఎత్తివేయడంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే వారిద్దరూ తగిన శిక్ష అనుభవించారని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేయగా... మరికొందరు వారి సేవలు జట్టుకు అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న జట్టు కూర్పు బాగుందని ఇంకొందరు తెలిపారు.

విచారణ లేకుండానే

విచారణ లేకుండానే

హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌పై అసలెందుకు వేటు వేశారు? విచారణ లేకుండానే ఎత్తివేశారని బీసీసీఐపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.'కాఫీ విత్ కరణ్' షో టాక్ షోలో మహిళలపై విమర్శలు చేయడంతో దుమారం రేగడంతో వీరిద్దరిపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

అంబుడ్స్‌మన్‌కు నిరాకరించిన సుప్రీం

అంబుడ్స్‌మన్‌కు నిరాకరించిన సుప్రీం

హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌‌లను విచారించి తుది నిర్ణయం తీసుకునేందుకు వెంటనే అంబుడ్స్‌మన్‌ను నియమించాలని బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. కోర్టు సహాయకుడిగా మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నర్సింహను మాత్రమే నియమించి ఇప్పటికిప్పుడు అంబుడ్స్‌మన్‌ను నియమించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

సస్పెన్షన్‌ ఎత్తివేసినట్లు ప్రకటించిన సీఓఏ

సస్పెన్షన్‌ ఎత్తివేసినట్లు ప్రకటించిన సీఓఏ

తాజాగా ఆయన బాధ్యతలు చేపట్టడంతో అతనితో చర్చించిన తర్వాత బీసీసీఐ పాలకుల కమిటీ పాండ్యా, రాహుల్‌పై గురువారం సస్పెన్షన్‌ ఎత్తివేసినట్లు ప్రకటించింది. మరోవైపు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్యా లేకపోవడంతో జట్టు కూర్పు కుదరడం లేదని, సమతూకం కష్టమవుతోందని టీమిండియా కెప్టెన్ కోహ్లీ తొలి వన్డే అనంతరం చెప్పిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, January 25, 2019, 12:41 [IST]
Other articles published on Jan 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X