న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పాక్‌తో భారత జట్టు క్రికెట్ ఆడొద్దనే డిమాండ్ సరైందే'

Banning cricket with Pakistan a justified demand: Union minister Ravi Shankar Prasad

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బ తిన్నాయి. దీనితో వరల్డ్‌కప్‌లో పాక్‌తో భారత్ ఆడబోయే మ్యాచ్‌ల మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే మాజీ ఆటగాళ్లు, హర్భజన్ హర్బజన్ పాకిస్తాన్ తో ఎట్టి పరిస్థితిలో క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని కొండబద్దలు కొట్టారు. అయితే ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఇటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమన్హారం.

<strong>బీసీసీఐ స్పందన ఇదీ: వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌ జరుగుతుందా?</strong>బీసీసీఐ స్పందన ఇదీ: వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌ జరుగుతుందా?

పాక్‌తో భారత్ ఆడకూడదు

పాక్‌తో భారత్ ఆడకూడదు

కేంద్ర మంత్రి రవి శంకర్ మాట్లాడుతూ "పాకిస్తాన్‌తో భారత్ ఆడకూడదని చాలా మంది డిమాండ్ చేయడం న్యాయ బద్దమైనదనే అభిప్రాయాన్ని" వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితులు బాగా లేవు. ప్రపంచ కప్ అనేది అంతర్జాతీయ టోర్నమెంట్. భారత్ పాకిస్తాన్ తో ఆడుతుందా .. లేదా అన్న విషయాన్ని ఐసీసీ , మన భారత బోర్డు నిర్ణయిస్తుందని, నా వరకు అయితే పాకిస్థాన్ ను పట్టించుకోకపోవటమే మేలు అని " చెప్పుకొచ్చాడు.

కేంద్రం ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటాం

కేంద్రం ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటాం

అయితే బీసీసీఐ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక భారత్ 2012-13 నుంచి పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ లను ఆడటం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్స్, ఆసియ కప్ లాంటి మెగా ఈవెంట్స్ ను మాత్రమే ఆడుతూ వస్తుంది. అయితే ఈ పరిణామాల నేపధ్యంలో ఇదివరకే ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ కూడా స్పందించారు.

వరల్డ్ కప్ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదు

వరల్డ్ కప్ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదు

"ప్రస్తుతానికి ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదని యధాప్రకారమే జరుగుతంది" అని తెలిపారు. అయితే జూన్ 16న మాంచెస్టర్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇంకా రిచర్డ్‌సన్ స్పందిస్తూ పుల్వామా ఘటనలో మరణించిన జవాన్లకు తన సానుభూతి వ్యక్తం చేసాడు. ప్రస్తుతం ఈ విషయంపై ఐసీసీ సభ్య దేశాలతో సమీక్షిస్తున్నాం" అని తెలిపారు. అయితే ఓ బీసీసీఐ సీనియర్‌ అధికారి మాత్రం ‘ప్రపంచకప్‌ లీగ్‌ దశలో ఆడం సరే... అదే ఏ సెమీస్‌లోనో, ఫైనల్లోనో ఆడాల్సి వస్తే మ్యాచ్‌ వదిలేసుకుంటామా? అని వ్యాఖ్యానించడం గమన్హారం.

Story first published: Wednesday, February 20, 2019, 15:43 [IST]
Other articles published on Feb 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X