న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్‌కు దూరం కానున్న షకీబ్ అల్ హసన్

 Bangladeshs Shakib Al Hasan May Skip Asia Cup For Surgery

హైదరాబాద్: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఆసియా కప్‌కు దూరం కావచ్చేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. సెప్టెంబర్ నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరగనున్న ఆసియా కప్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించట్లేదు. జనవరి నెలలో శ్రీలంకతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ ఎడమ చేతికి చిటికిన వేలికి గాయమైంది. 'నా వేలికి చికిత్స అవసరం అని అందరికీ తెలిసిందే.

కాకపోతే వెస్టిండీస్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ పర్యటన ముగిశాక చేయించుకోవాలనుకున్నాను. కానీ, అంతకుముందే చేయించుకోవాలనుకుంటున్నాను. ఆసియా కప్ కంటే ముందే చేయించుకుంటుండటంతో.. ఆ టోర్నీకి అందుబాటులో ఉండొచ్చు.. ఉండలేకపోవచ్చు' అని చెప్పుకొచ్చాడు. ఈ వేలికి ఆస్ట్రేలియాలో చికిత్స చేయించుకున్న షకీబ్ మార్చి నెలలో శ్రీలంకతో జరిగిన నిదహాస్ ట్రోఫీకి హాజరైయ్యాడు. అయితే అప్పటికీ వైద్యులు అతనికి శస్త్ర చికిత్స సూచించడంతో దానిని నిర్లక్ష్య పెట్టాడు.

ఇటీవల జరుగుతోన్న వెస్టిండీస్ పర్యటనలో అతని నొప్పి తిరగబడటంతో శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సిద్ధమైయ్యాడు. ఈ టీ 20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 2-1తేడాతో గెలుపొందింది. మొత్తానికి ఆసియా కప్ మిస్సవుతున్నా.. శస్త్ర చికిత్స చేయించుకుని ప్రపంచ కప్ 2019 కల్లా సిద్ధంగా ఉండాలని షకీబ్ భావిస్తున్నాడు.

'ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ తరపున ఆడే సమయంలో పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలని భావిస్తున్నాను. ఆ క్రమంలోనే సర్జరీకి ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నాను. అందుకనే ఆసియా కప్ కంటే ముందే సర్జరీ చేయించుకుంటున్నా' అని పేర్కొన్నాడు. ఆసియా కప్‌లో భాగంగా పూల్ బీ జాబితాలో బంగ్లాదేశ్‌తో పాటు శ్రీలంక, అఫ్ఘనిస్తాన్‌లు ఉన్నాయి. వీటి మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 15 నుంచి 28 వరకూ జరగనుంది.

Story first published: Thursday, August 9, 2018, 16:58 [IST]
Other articles published on Aug 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X