న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభిమానులను నిరాశకు గురిచేశాం: ఓటమికి బాధ్యత నాదేనన్న కెప్టెన్

Bangladeshs Mashrafe Mortaza takes blame for disappointing World Cup

హైదరాబాద్: ఈ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమై.. అభిమానులను నిరాశకు గురిచేశామని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫె మొర్తాజా అన్నాడు. ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఓటమికి తనదే బాధ్యత అని మొర్తాజా అధికారిక ప్రకటన చేశాడు. ఈ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించకుండానే బంగ్లాదేశ్‌ జట్టు నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

"ఈ ప్రపంచకప్‌లో మిమ్మల్ని మేం అసంతృప్తికి గురిచేశాం. మీ అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాం. అందుకు చింతిస్తున్నాం" అని ఇంగ్లాండ్‌ నుంచి ఢాకా చేరుకున్న అనంతరం మొర్తాజా ఢాకాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆవేదన చెందాడు.

మా ఆటతీరు సానుకూలంగానే ఉంది

మా ఆటతీరు సానుకూలంగానే ఉంది

"మొత్తంగా చూసుకుంటే మా ఆటతీరు సానుకూలంగానే ఉంది. కానీ, మా మీద ఉంచిన అంచనాలను అందుకోలేకపోయాం. చివరి మ్యాచ్‌లో గెలిచినా.. టాప్‌ ఐదో స్థానంలో ఉండేవాళ్లం. కానీ, అభిమానులు మాత్రం మమ్మల్ని సెమీస్‌కు చేరుకోవాలని కోరుకున్నారు. దురుదృష్టవశాత్తు అది జరగలేదు" అని మొర్తాజా తెలిపాడు.

7 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో

7 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో

7 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచి.. ప్రపంచకప్‌ లీగ్‌ దశలోనే బంగ్లాదేశ్‌ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, ఆప్ఘనిస్థాన్‌ జట్లను ఓడించిన బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియా, ఇండియా జట్లకు గట్టి పోటీనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, భారత్‌, పాక్ చేతిలో ఓడిపోగా... టోర్నీ లీగ్ మ్యాచ్‌లో సఫారీలు ఆస్ట్రేలియాను ఓడించడంతో బంగ్లా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.

సెమీస్‌ అవకాశాలు సజీవంగానే!

సెమీస్‌ అవకాశాలు సజీవంగానే!

"భారత్‌తో మ్యాచ్‌ వరకు మాకు సెమీస్‌ అవకాశాలు సజీవంగా నిలిచాయి. కానీ, షకీబ్, ముష్ఫిక్‌ రహీం తప్ప మిగతా ఆటగాళ్లు నిలకడగా రాణించకపోవడం తమ అవకాశాలను దెబ్బతీసింది" అని మొర్తాజా వెల్లడించాడు. ఈ వరల్డ్‌కప్‌లో షకీబ్, ముష్ఫిక్‌తోపాటు ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ సైఫుద్దీన్‌ కూడా అద్భుతంగా రాణించాడని మొర్తాజా తెలిపాడు.

Story first published: Monday, July 8, 2019, 12:36 [IST]
Other articles published on Jul 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X